Site icon NTV Telugu

Kasthuri Shankar : పూనమ్ వ్యవహారంపై ఘాటుగా స్పందించిన కస్తూరి..

Whatsapp Image 2024 02 05 At 7.27.32 Am

Whatsapp Image 2024 02 05 At 7.27.32 Am

పూనమ్‌ పాండే చనిపోయిందంటూ తన టీం తో ఆమె తప్పుడు ప్రచారం చేయించిన సంగతి తెలిసిందే.అయితే దీన్ని దేశమంత నమ్మింది. అయితే ఆ తర్వాత మరుసటి రోజే తాను బ్రతికే ఉన్నానని, సర్వైకల్‌ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఇలా చేశానంటూ ఆమె చెప్పడంతో అంతా అవాక్కయ్యారు.దీంతో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది. ఆమె మరణవార్త కంటే.. ఫేక్ పబ్లిసిటీ స్టంటే సంచలనంగా మారింది. చెత్త పబ్లిసిటీ అంటూ సామాన్య ప్రజల నుంచి సినీ సెలబ్రిటీల వరకు పూనమ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.ఇలాంటి తప్పుడు ప్రచారం మంచిది కాదని, మనుషుల మనోభవాలతో ఆడుకోవడమే అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. ఇక సినీ సెలబ్రిటీలు పూనమ్‌పై తమదైన తీరుతో విరుచుకుపడుతున్నారు.

తాజాగా సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్‌ పూనమ్‌ వ్యవహరంపై ఘాటుగా స్పందించారు.ఆదివారం ఓ న్యూస్ ఛానల్‌తో జరిగిన డిబేట్‌లో పూనమ్‌ వ్యవహారంపై ఆమె మండిపడింది. ఇదొక చెత్త పబ్లిసిటీ స్టంట్‌ అని ఇలాంటి వాటి వల్ల ఒరిగేదేం లేదంటూ కస్తూరి విమర్శించింది.పూనమ్ పాండే మృతి అంత పెద్ద వార్త అని నేను అస్సలు అనుకోవడం లేదు. క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కంటే ఆమె మృతి పెద్ద విషయమేం కాదు. అయినా ఇలా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఒకవేళ సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలనుకుంటే దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈ మహమ్మారితో పారాడుతోన్న కొన్ని వేల మంది క్యాన్సర్ వారియర్స్‌కి ఆమె పెద్ద డొనేషన్ ఇచ్చి కూడా ఉండొచ్చు. తను అలా చేసి ఉంటే తనపై అందరిలో పాజిటివ్‌ అభిప్రాయం ఉండేది. ఆమెపై రెస్పెక్ట్‌ కూడా మరింత పెరిగేది.. కానీ చనిపోయినట్లుగా ఆమె నాటకం ఆడింది.. గతంలో కూడా పూనమ్‌ ఇలాంటి చెత్త పబ్లిసిటీ డ్రామాలు ఆమె చాలా చేసింది. ఇప్పుడు ఇది కూడా అందులో ఒకటి అయిపోయింది. తన పబ్లిసిటీ కోసం బ్రెస్ట్ క్యాన్సర్‌ను వాడుకోలేదు సంతోషం” అంటూ కస్తూరి ఘాటూ వ్యాఖ్యలు చేసింది

Exit mobile version