బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ మూవీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ ని సందీప్ మోస్ట్ వైలెంట్ గా ప్రజెంట్ చేశారు.. సందీప్ రెడ్డి టేకింగ్ కి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అయితే సాధారణంగా సందీప్ రెడ్డి చిత్రం అంటే రొమాన్స్ కూడా బోల్డ్ గానే ఉంటుంది. దీనితో యానిమల్ మూవీ యూత్ ఆడియన్స్ కు తెగ నచ్చేసింది.ఈ సినిమాలో రణబీర్ కపూర్ యాంగ్రీ అండ్ ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టారు.గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.అయితే తమిళ ప్రేక్షకులు మరియు సెలెబ్రిటీలకి యానిమల్ చిత్రం ఏమాత్రం నచ్చడం లేదు.
తమిళ ఆడియన్స్ ఒకవైపు ఈ చిత్రాన్ని ట్రోల్ చేస్తుంటే సెలెబ్రిటీలు కూడా యానిమల్ మూవీ పై కామెంట్స్ చేస్తున్నారు. యానిమల్ మూవీ ఓటిటిలోకి రిలీజ్ అయిన తర్వాత ఇది మరింత ఎక్కువైంది.ఇటీవల సీనియర్ నటి రాధిక యానిమల్ చిత్రాన్ని విమర్శిస్తూ పోస్ట్ చేసింది. తాజాగా గృహలక్ష్మి సీరియల్ నటి, ఒకప్పటి హీరోయిన్ అయిన కస్తూరి శంకర్ యానిమల్ మూవీపై షాకింగ్ వ్యాఖ్యలు చేసారు.గత రాత్రి ఈ చిత్రం చూద్దామని ప్రారంభించాను. సగం చూసే సరికే నాకు విసుగు పుట్టింది. ఇక ప్రేక్షకులు మూడున్నర గంటలు ఈ చిత్రాన్ని ఎలా చూశారో అర్థం కావడం లేదు.కేవలం మాటల్లోనే ప్రేమలో పడిపోవడం ఏంటో ? ఆ ఆటో ప్లైయింగ్ ప్లేన్స్ ఏంటో ? అన్ని చాలా వేగంగా జరిగిపోయాయి. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈ చిత్రం కోసం యూనిట్ అంతా చాలా చక్కగా వర్క్ చేశారు. కానీ అన్ని చాలా అతిగా అనిపించాయి. నాకు ఈ చిత్రం వినోదాన్ని కలిగించలేదు అంటూ కస్తూరి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
So i started watching this movie last night…half way into the movie I am already exhausted. How did people sit in cinema halls for 3 + hrs ?!
Talking of time….making love in an autoflying plane ? How fast were they going or …er…coming 😵💫 …such
Animal instinct 🥴— Kasturi (@KasthuriShankar) January 28, 2024
