Botsa Satyanarayana: శ్రీకాకుళంలో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల లోపంతో పాటు పాలనా వ్యవహారాలపై ఆయన తన ఆవేదనతో పాటు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏం లేదు. హత్యలు, మానభంగాలు, అక్రమ కేసులు మాములు అయ్యాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం లేస్తే రాజకీయం తప్ప, ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తాను బాధతో, బాధ్యతతో ఈ విషయాలు మాట్లాడుతున్నానని.. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని అన్నారు.
Cyber Fraud: ఇరాక్‌లో ఉన్న జగిత్యాల యువకుడికి సైబర్ ముఠా టోకరా.. NTVని ఆశ్రయించిన బాధితుడు
అలాగే ప్రతి సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం బాధ్యత వహించడం లేదని బొత్స మండిపడ్డారు. అంతేకాకుండా ఘటనలు జరిగిన తరువాత చర్యలు ఉండటం లేదు. నిమిత్తమాత్రుడిని అని ముఖ్యమంత్రి చెబితే.. కస్టోడియన్ ఎవరు? ఇలాంటి బాధ్యత లేని గవర్నమెంట్‌ను నేను ఎప్పుడూ చూడలేదు అని ఘాటుగా విమర్శించారు. ఘటనలకు బాధ్యులు ఎవరని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి చేతకాకపోతే, అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి సలహాలు అడగాలని బొత్స సవాల్ విసిరారు. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందని, ప్రభుత్వానికి అవగాహన లేదా అని బొత్స ప్రశ్నించారు. తుఫాన్ వంటి విపత్తుల సమయంలో కూడా ముఖ్యమంత్రి కేవలం కంప్యూటర్ ముందు కూర్చుని ‘పనికిమాలిన కబుర్లు’ చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
LVM3-M5 Rocket: ఇస్రో ఖాతాలో మరో విజయం.. LVM3-M5 ప్రయోగం సక్సెస్..
టీటీడీ బోర్డు వ్యవహారాల్లో “లడ్డు కల్తీ అంటారు, లేదా ఏదో ఇష్యూ బయట జరుగుతుంది” అని విమర్శించారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు తమ పనిని వారు చేసుకోనివ్వాలని హితవు పలికారు. గతంలో పుష్కరాలలో జరిగిన దుర్ఘటనను గుర్తు చేస్తూ.. పుష్కరాలలో తోపులాటా జరిగింది కదా.. ఎందుకు ఇంకా క్రౌడ్‌ను మేనేజ్ చేయలేకపోతున్నారు? అని ప్రశ్నిస్తూ, క్రౌడ్ మేనేజ్‌మెంట్ వైఫల్యాన్ని ఎత్తి చూపారు. ప్రమాద ఘటనల్లో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాలని ప్రకటించిన 15 లక్షలకు బదులుగా 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. అంతేకాకుండా, తాజాగా జరిగిన ఘటనలో బాధిత కుటుంబాలకు వైఎస్సార్సీపీ పార్టీ తరపున 2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
