Site icon NTV Telugu

Kashmir Times: ‘కాశ్మీర్ టైమ్స్’ ఆఫీస్‌పై SIA రైడ్స్.. ఏకే-47 బుల్లెట్లు, పిస్టల్ సీజ్

Kashmir Times

Kashmir Times

Kashmir Times: జమ్మూలోని కాశ్మీర్ టైమ్స్ కార్యాలయంపై గురువారం రాష్ట్ర దర్యాప్తు సంస్థ (SIA) రైడ్స్ నిర్వహించింది. ఈసందర్భంగా SIA అధికారులు మాట్లాడుతూ.. దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనడం, ఉగ్రవాద భావజాలాలకు మద్దతు ఇవ్వడం వంటి ఆరోపణలపై కాశ్మీర్ టైమ్స్ వార్తాపత్రిక జమ్మూ ప్రధాన కార్యాలయంపై రైడ్స్ నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ రైడ్స్‌లో AK-47 బుల్లెట్లు, ఒక పిస్టల్, గ్రెనేడ్ లివర్లతో సహా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏజెన్సీ తెలిపింది.

READ ALSO: 120X జూమ్, 7000mAh బ్యాటరీ, 200MP టెలిఫోటో, Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ లతో Realme GT8 Pro లాంచ్..!

పలు నివేదికల ప్రకారం.. జర్నలిస్ట్ వేద్ భాసిన్ ఆధ్వర్యంలో నడుస్తున్న కాశ్మీర్ టైమ్స్ కొంతకాలంగా జమ్మూ నుంచి దాని ప్రింట్ ఎడిషన్ ప్రచురణను నిలిపివేసింది. ఇప్పుడు ప్రధానంగా ఈ పత్రిక ఆన్‌లైన్‌లో పనిచేస్తోంది. భాసిన్ మరణం తరువాత, దీనిని ఆయన కుమార్తె అనురాధ భాసిన్, ఆమె భర్త ప్రబోధ్ జామ్వాల్ నిర్వహిస్తున్నారు. అయితే ఇద్దరూ అమెరికాకు వెళ్లి గత కొన్నేళ్లుగా అక్కడ నివసిస్తున్నారు. ఈ వెబ్‌సైట్‌కు ప్రబోధ్‌ ఎడిటర్‌గా, అనురాధ మేనేజింగ్ ఎడిటర్‌గా ఉన్నట్లుగా సమాచారం.

మొదట ఎఫ్ఐఆర్.. తాజాగా రైడ్స్..
గురువారం ఉదయం 6 గంటలకు జమ్మూలోని కాశ్మీర్ టైమ్స్ కార్యాలయంపై SIA అధికారులు రైడ్స్ ప్రారంభించారు. ఈ వార్తాపత్రిక మేనేజర్ సంజీవ్ కెర్నిని ఆయన ఇంటి నుంచి పిలిపించి కార్యాలయాన్ని తెరిచారు. పలు నివేదికల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం ఆ వార్తాపత్రికపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. దేశ వ్యతిరేక విషయాలను ప్రచురించారనే ఆరోపణలతో కాశ్మీర్ టైమ్స్ వార్తాపత్రిక, జమ్మూ కాశ్మీర్ కార్యాలయంపై గతంలో దాడి కూడా జరిగింది. ప్రస్తుతం ఈ పత్రిక గత కొన్ని నెలలుగా ప్రచురణను నిలిపివేసింది.

READ ALSO: Varanasi : మహేష్ – రాజమౌళి ‘వారణాసి’ లో హనుమంతుడిగా మాధవన్?

Exit mobile version