Karur Stampede: కరూర్ తొక్కిసలాట కేసును సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడానికి మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ నిరాకరించింది. కేసు దర్యాప్తు ప్రారంభ దశలో ఉన్నందున, ప్రస్తుతానికి ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. సభలు, ర్యాలీలో నిర్వహించే సమయంలో కనీసం నీళ్ళు కూడా ఎందుకు ఇవ్వలేదని టీవీకే పార్టీని కోర్టు ప్రశ్నించింది. కనీస అవసరాలైన నీళ్ళు, ఆహారం, టాయిలెట్లు, పార్కింగ్ ఉండేలా ఎందుకు చూసుకోలేదంటూ ప్రశ్నించింది. రోడ్డు సమావేశం ఎర్పాటు ఎందుకు అనుమతి ఇచ్చారని పోలీసులను అడిగింది. బాధితులకు పరిహారం పెంపుపై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలన్న ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు.. టీవీకే నేతల ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.
READ MORE: PVN Madhav: పెట్రోల్‌పై జీఎస్టీ తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అంగీరించట్లే..
మరోవైపు టీవీకే పార్టీ చీఫ్, సినీ నటుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను చేపట్టిన రాష్ట్రవ్యాప్త పర్యటనలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పర్యటనలను రెండు వారాల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది.. కాగా, ఈ తొక్కిసలాట ఘటనపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి.. విజయ్.. అధికార డీఎంకేపై ఆరోపణలు గుప్పిస్తుండగా.. డీఎంకే.. విజయ్‌పై కౌంటర్ ఎటాక్ చేస్తోంది.. కాగా, ఈ ఘటనలో ఇప్పటి వరకు 41 మంది మృతుల్ని ప్రకటించారు. ఘటన జరిగిన సెప్టెంబర్ 27న రాత్రి కరూర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రి తెచ్చినవారిలో 39మంది మార్గమధ్యంలోనే మృతిచెందినట్లుగా వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇక, పోస్ట్‌మార్టం నిర్వహించిన 41మందిలో 18 మంది మహిళలు, 13 మంది పురుషులు, 10 మంది చిన్నారులు ఉన్నారు..
