Site icon NTV Telugu

Annagaru Vostaru: కార్తీ కొత్త సినిమా ‘అన్నగారు వస్తారు’ టీజర్ రిలీజ్.. చూశారా..?

Annagaru Vostaru

Annagaru Vostaru

Annagaru Vostaru: తెలుగులో భారీ ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకున్న తమిళ నటుడు కార్తీ (Karthi).. మరోసారి ప్రేక్షకుల ముందుకు కొత్త యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రానున్నారు. గత ఏడాది ‘సత్యం సుందరం’తో మంచి విజయాన్ని అందుకున్న ఆయన, ఇప్పుడు ‘అన్నగారు వస్తారు’ అనే కొత్త చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రం తమిళంలో ‘వా వాతియార్‌’ (Vaa Vaathiyaar) పేరుతో రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్‌ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. టీజర్‌ ను గమనించినట్లయితే.. కార్తీ ఈ చిత్రంలో ఒక ఫుల్ ఎనర్జిటిక్, ఫన్ టచ్ ఉన్న పోలీస్ అధికారిగా నటిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.

AP Liquor Scam Case: లిక్కర్ కేసులో చెవిరెడ్డి ఇంప్లీడ్ పిటిషన్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఇక ఈ సినిమాలో హీరో కార్తీకి జోడీగా నటిస్తున్న కృతిశెట్టి (Krithi Shetty) నటిస్తోంది. డైలాగ్స్ లేకుండా గ్లింప్స్ స్టైల్‌లో రూపొందించిన ఈ వీడియోలో ఓ మంచి మాస్ మ్యూజిక్ బీట్‌కు కార్తీ చేసిన డ్యాన్స్, పలువురు పాత్రల పరిచయాలు ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తున్నాయి. ఈ చిన్న గ్లింప్స్‌లోనే హీరో క్యారెక్టర్‌ స్వభావాన్ని ప్రేక్షకులకు సూచించే ప్రయత్నం చేశారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ నిర్మిస్తోంది. కార్తీ స్టైల్, యాక్షన్, కామెడీ అన్ని సమపాళ్లలో ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతున్నట్లు కనిపిస్తోంది. ఇక విడుదల విషయానికి వస్తే, ‘అన్నగారు వస్తారు’ సినిమా వచ్చే నెల డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న అవకాశం ఉంది. కచ్చితమైన తేదీ ఇంకా వెల్లడించలేదు.

Fire-Boltt ONYX: క్రేజీ ఆఫర్ బ్రో.. రూ. 21000ల ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ కేవలం రూ. 1499కే.. అమోల్డ్ డిస్ప్లేతో

Exit mobile version