NTV Telugu Site icon

Karthikeya 3 : కార్తికేయ 3 అప్డేట్ ఇచ్చిన నిఖిల్.. త్వరలోనే అడ్వెంచర్ స్టార్ట్..

Karthk

Karthk

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్, చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ కార్తికేయ.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్ గా కార్తికేయ 2 ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.. ఆ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చెయ్యగా భారీ విజయాన్ని అందుకోవడం తో నిఖిల్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. ఇక తాజాగా కార్తికేయ 3 వచ్చేసింది.. త్వరలోనే స్టార్ట్ అవ్వబోతుందని తెలుస్తుంది..

కార్తికేయ 2 నిఖిల్ కేరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ఏకంగా 120 కోట్ల కలెక్షన్స్ సాధించింది.. దాంతో ఈ సినిమాకు సీక్వెల్ గా రాబోతుందని అప్పుడే ప్రకటించారు.. కానీ ఆ సినిమా ఎప్పుడు ఉంటుందో చెప్పలేదు. తాజాగా నిఖిల్ అధికారికంగా తన సోషల్ మీడియాలో దీని గురించి అప్డేట్ ఇచ్చాడు.. తన x లో త్వరలోనే కార్తికేయ 3 మొదలు కాబోతుందని హింట్ ఇచ్చాడు.. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది..

ఇదిలా ఉండగా డైరెక్టర్ చందూ మొండేటి ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య తో తండేల్ సినిమాను తెరాకెక్కిస్తున్నారు.. ఆ సినిమా అయ్యాక కార్తికేయ 3 మొదలుపెట్టనున్నాడు. త్వరలోనే కార్తికేయ 3 నుంచి అధికారిక పోస్ట్ రిలీజ్ చేయనున్నారు.. మరి ఈసారి ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడు అనేది ఆసక్తిగా మారింది.. నిఖిల్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఆ సినిమాలు అయ్యాకే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతుందని తెలుస్తుంది..