NTV Telugu Site icon

Koti Deepotsavam 2024 Day 10: కార్తీక మూడో సోమవారం.. ‘కోటి దీపోత్సవం’లో నేటి విశేష కార్యక్రమాలు ఇవే!

Koti Deepotsavam 2024 Day 10

Koti Deepotsavam 2024 Day 10

కార్తిక మాసం శుభవేళ భక్తి టీవీ ఆధ్వర్యంలో ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమం దిగ్వజయంగా కొనసాగుతోంది. రోజుకో అనుగ్రహ భాషణం, పీఠాధిపతుల ప్రవచనాలు, కల్యాణం, వాహనసేవలతో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం కళకళలాడిపోతోంది. కోటి దీపోత్సవం వేళ హైదరాబాద్‌ మహా నగరం సహా పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. కోటి దీపోత్సవం 2024లో ఇప్పటికే తొమ్మిది రోజులు విజయవంతంగా ముగిసాయి. 10వ రోజులో మరిన్ని విశేష కార్యక్రమాలకు భక్తి టీవీ సిద్ధం అవుతోంది.

నేడు కార్తీక మూడో సోమవారం. ఈ ప్రత్యేక రోజున కోటి దీపోత్సవంలో జరిగే విశేష కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం. నేడు శ్రీ చెన్న సిద్ధరామ పండితారాధ్య స్వామీజీ, శ్రీ పరిపూర్ణానందగిరి స్వామీజీ అనుగ్రహ భాషణం చేయనున్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనామృతం వినిపించనున్నారు. వేదికపై కాశీ జ్యోతిర్లింగ మహాపూజ జరగనుంది. భక్తులచే శివలింగాలకు కోటి పుష్పార్చన జరగనుంది. కాశీ శ్రీ విశ్వేశ్వర విశాలాక్షి కల్యాణం ఉంటుంది. నంది వాహన సేవ ఉంటుంది.

Also Read: Gold Rate Today: భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?

10వ రోజు విశేష కార్యక్రమాలు ఇవే:
# శ్రీ శ్రీ చెన్న సిద్ధరామ పండితారాధ్య స్వామీజీ (జగద్గురు పీఠాధిపతి, శ్రీశైలం), శ్రీ పరిపూర్ణానందగిరి స్వామీజీ (వ్యాసాశ్రమ పీఠాధిపతి, ఏర్పేడు) గారిచే అనుగ్రహ భాషణం
# బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనామృతం
# వేదికపై కాశీ జ్యోతిర్లింగ మహాపూజ
# భక్తులచే శివలింగాలకు కోటి పుష్పార్చన
# కాశీ శ్రీ విశ్వేశ్వర విశాలాక్షి కల్యాణం
# నంది వాహన సేవ

Show comments