NTV Telugu Site icon

Srisailam Temple : ఈనెల 26 నుండి కార్తీక మాసోత్సవాలు

Srisailam

Srisailam

కార్తీక మాసం అంటే శివుడికి ఎంతో ఇష్టం. ఈ నెలలో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఆలయానికి సైతం కార్తీక మాసం సందర్భంగా భక్తులు పోటెత్తుతారు. అయితే.. ఈ నెల 26 నుంచి కార్తీకమాసం ప్రారంభం కానుంది. అయితే. .ఈ నేపథ్యంలో కార్తీకమాస ఉత్సవాలు, భక్తులకు ఏర్పాట్లపై ఆలయ ట్రస్ట్ బోర్డ్, ఈవో లవన్న అధికారులు సమావేశమయ్యారు. అయితే.. శ్రీశైలంలో ఈనెల 26 నుండి నవంబర్ 23 వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో లవన్న మాట్లాడుతూ.. కార్తీక సోమవారాలు, ప్రభుత్వ సెలవులలో భక్తుల రద్దీ దృష్ట్యా స్పర్శ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రద్దీ రోజులలో భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు.

 

నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా ఉదయం 6 నుండి సాయంత్రం 6.30 వరకు ఆలయ ద్వారాలు మూసివేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా ఆర్జిత, శాశ్వత, పరోక్షసేవలు నిలివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పాతాళ‌గంగ వ‌ద్ద ఉన్న శౌచ‌లాయాలు, స్త్రీలు దుస్తులు మార్చుకునే గ‌దులతో పాటు మెట్ల మార్గంలో అవ‌స‌ర‌మైన మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాల‌ని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. నేడు ఉదయం నుంచి శ్రీశైలం క్షేత్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో.. శ్రీశైలం ఘాట్‌ రోడ్డలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శ్రీశైలంపైకి వెళ్లె వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.