కార్తిక మాసం శుభవేళ రోజుకో కల్యాణం, వాహనసేవ, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలతో ‘కోటి దీపోత్సవం’ విజయవంతంగా కొనసాగుతోంది. కోటి దీపోత్సవం వేళ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం శివనామస్మరణతో మార్మోగిపోతోంది. హైదరాబాద్ మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల నలు మూలాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. దీపాల పండుగలో పాల్గొంటున్నారు. భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవం 2024లో ఇప్పటికే 13 రోజులు దిగ్విజయంగా ముగిసాయి.
కోటి దీపోత్సవంలో 14వ రోజు కార్యక్రమాలకు భక్తి టీవీ సిద్దమైంది. కార్తీక శుక్రవారం వేళ.. ఈరోజు జరిగే విశేష కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం. నేడు సద్గురు శ్రీ రితేశ్వర్ స్వామీజీ (ఆనందధామం పీఠాధిపతి, బృందావనం) అనుగ్రహ భాషణం చేయనున్నారు. బ్రహ్మశ్రీ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారు ప్రవచనామృతం వినిపించనున్నారు. వేదికపై కనకదుర్గమ్మకు కోటి గాజుల అర్చన, ఉడుపి శ్రీకృష్ణ నవనీత పూజ జరగనుంది. భక్తులచే కనకదుర్గమ్మ విగ్రహాలకు కోటిగాజుల అర్చన చేయిస్తారు. మధురై మీనాక్షి కల్యాణోత్సవం జరిపించనున్నారు. నంది వాహన సేవ ఉంటుంది.
14వ రోజు విశేష కార్యక్రమాలు ఇవే:
# సద్గురు శ్రీ రితేశ్వర్ స్వామీజీ (ఆనందధామం పీఠాధిపతి, బృందావనం) గారిచే అనుగ్రహ భాషణం
# బ్రహ్మశ్రీ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారిచే ప్రవచనామృతం
# వేదికపై కనకదుర్గమ్మకు కోటి గాజుల అర్చన, ఉడుపి శ్రీకృష్ణ నవనీత పూజ
# భక్తులచే కనకదుర్గమ్మ విగ్రహాలకు కోటిగాజుల అర్చన
# మధురై మీనాక్షి కల్యాణోత్సవం
# నంది వాహన సేవ