కార్తిక మాసం శుభవేళ భక్తి టీవీ, ఎన్టీవీల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు కోటి దీపోత్సవ వేడుకకు తరలివస్తున్నారు. దాంతో ప్రతి రోజు ఎన్టీఆర్ స్టేడియం శివనామస్మరణతో మార్మోగుతోంది. 2024 నవంబర్ 9న ఆరంభమైన కోటి దీపోత్సవం.. నవంబర్ 25 వరకు కొనసాగనుంది. ప్రతిరోజు సాయంత్రం 5.30 గంటలకు కార్యక్రమాలు మొదలవుతాయి.
కోటి దీపోత్సవం 2024లో ఇప్పటికే పది రోజులు విజయవంతంగా ముగిశాయి. నేడు పదకొండవ రోజుకు భక్తి టీవీ సిద్దమైంది. కార్తీక మంగళవారం వేళ.. శ్రీ చంద్రశేఖర శివాచార్య స్వామీజీ (జగద్గురు పీఠం, కాశీ), శ్రీ సచ్చిదానందభారతి మహాస్వామీజీ (యడనీరు మఠం, కాసరగోడ్, కేరళ), సద్గురు శ్రీ బ్రహ్మేశ్వరానంద ఆచార్య స్వామీజీ (శ్రీ దత్తపద్మనాభ పీఠం, గోవా)లు అనుగ్రహ భాషణం చేయనున్నారు. బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారు ప్రవచనామృతం వినిపించనున్నారు. వేదికపై సుబ్రహ్మణ్య స్వామికి కోటి పుష్పార్చన జరగనుంది. భక్తులచే సుబ్రహ్మణ్య విగ్రహాలకు కోటి పుష్పార్చన ఉంటుంది. ఆరుపడైవీడు క్షేత్రాల కుమారస్వామి కల్యాణాలు ఉన్నాయి. మయూర వాహనం, పల్లకీ సేవ ఉంటుంది.
Also Read: Realme GT 7 Pro: ‘రియల్‌మీ జీటీ 7 ప్రో’ ప్రీ-బుకింగ్ మొదలు.. ఆఫర్లు ఇవే!
పదకొండవ రోజు విశేష కార్యక్రమాలు ఇవే:
# శ్రీ చంద్రశేఖర శివాచార్య స్వామీజీ, శ్రీ సచ్చిదానందభారతి మహాస్వామీజీ, సద్గురు శ్రీ బ్రహ్మేశ్వరానంద ఆచార్య స్వామీజీలు గారిచే అనుగ్రహ భాషణం
# బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి ప్రవచనామృతం
# వేదికపై సుబ్రహ్మణ్య స్వామికి పూజ
# భక్తులచే సుబ్రహ్మణ్య విగ్రహాలకు కోటి పుష్పార్చన
# ఆరుపడైవీడు క్షేత్రాల కుమారస్వామి కల్యాణాలు
# మయూర వాహనం, పల్లకీ సేవ