కోలీవుడ్ స్టార్ హీరో కార్తి, టాలీవుడ్ బ్యూటీ కృతిశెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘వా వాతియార్’. తెలుగులో ఈ సినిమాను ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్‌తో విడుదల చేశారు. ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జనవరి 28 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది.
Also Read : Tharun Bhascker : నచ్చకపోయినా నటించా.. తరుణ్ భాస్కర్ షాకింగ్ కామెంట్స్!
ఈ సినిమా కథాంశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దివంగత లెజెండరీ నటుడు ఎంజీఆర్‌కు రాజ్ కిరణ్ వీరాభిమాని. ఎంజీఆర్ మరణించిన రోజే మనవడు పుట్టడంతో, ఆ నటుడే మళ్ళీ పుట్టాడని భావించి తన మనవడికి రామేశ్వరన్ (కార్తి) అని పేరు పెడతాడు. తన మనవడిని ఎంజీఆర్ లాగే నీతిగా, నిజాయతీగా ఉండే పోలీస్ ఆఫీసర్‌గా చూడాలనుకుంటాడు. కానీ, తాత ఆశయాలకు భిన్నంగా రామేశ్వరన్ లంచగొండి పోలీస్‌గా తయారవుతాడు. తన మనవడి అసలు స్వరూపం తెలిసి తాత రాజ్ కిరణ్ ప్రాణాలు విడుస్తాడు. ఆ తర్వాత రామేశ్వరన్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? తన తప్పును తెలుసుకుని అతను ఎలా మారాడు? అనేది మిగిలిన కథ. ఎమోషన్ యాక్షన్ కలగలిసిన ఈ చిత్రాన్ని థియేటర్లో మిస్ అయిన వారు రేపటి నుండి ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.
