తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ చిత్రం ‘వా వాతియార్’. నలన్ కుమారస్వామి తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా తమిళనాట పొంగల్ బరిలో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టిజర్, ట్రైలర్ తో ఓ మోస్తరు అంచనాలు తెచ్చుకున్న అనేక సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అవడంతో సినిమాకు ఉన్న బజ్ కాస్త తగ్గుతూ వచ్చింది.
Also Read : Pawan Kalyan : మన శంకర వరప్రసాద్ కు ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ విషెష్
ఇక రిలీజ్ అయిన మొదటి ఆట నుండి ఈ చిత్రం ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కథలో సరైన ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలు లేకపోవడం, స్క్రీన్‌ప్లేలో లోపాలు, స్లో పేజ్ లో ఉండటంతో సినిమాకు భారీ నెగటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. దీంతో తమిళనాట ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. అటు ఓవర్సీస్ లోను ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఇదిలా ఉండగా, ఈ సినిమాను తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్‌తో విడుదల చేయాలని మేకర్స్ ముందుగానే ప్రకటించారు. అయితే, సంక్రాంతి సీజన్‌లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ చిత్రాలు ఎక్కువగా రిలీజ్ కావడంతో ఇక్కడ రిలీజ్ వాయిదా వేశారు. మరోవైపు తమిళంలో ఈ సినిమా డిజాస్టర్‌గా నిలవడంతో తెలుగులో రిలీజ్ చేసే ఉద్దేశాన్ని విరమించుకున్నట్టు సమాచారం. ఈ రోజుల్లో సినిమా బాగుంటేనే ఆడియెన్స్ అంతంత మాత్రంగా వస్తున్నారు. ఇక ప్లాప్ సినిమా అది డబ్బింగ్ సినిమా అంటే కనీసం ఆడియెన్స్ థియేటర్స్ వైపు తొంగి చూసే పరిస్థితి కూడా లేదు. దాంతో ‘అన్నగారు వస్తారు’ తెలుగు రిలీజ్ దాదాపు లేనట్టే. డైరెక్ట్ గా ఓటీటీలోనే తెలుగు వర్షన్ ను రిలీజ్ చేసేలా ఉన్నట్టు సమాచారం.
