Site icon NTV Telugu

Karnataka: పిల్లలు లేరన్న కోపంతో భార్యను చంపిన భర్త.. హార్ట్ ఎటాక్‌గా చిత్రీకరించి చివరికీ..

Kk

Kk

Karnataka: కర్ణాటకలోని బెలగావి జిల్లా నెగినహాల్ గ్రామంలో జరిగిన ఘోర విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. రాజేశ్వరి ఫకీరప్ప గిలక్కణవర మృతి మొదట హార్ట్ అటాక్‌గా చిత్రికరించినప్పటికీ, చివరకు అది హత్యగా తేలింది. ఈ దారుణానికి ఆమె భర్త ఫకీరప్ప గిలక్కణవర పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా, రాజేశ్వరి మృతి చెందిన తర్వాత, ఆమెకు గుండెపోటు వచ్చి చనిపోయిందని భర్త అందరికీ చెప్పాడు. అంత్యక్రియల కోసం బంధువులను స్వగ్రామానికి పిలిచాడు. అయితే, అంత్యక్రియలకు వచ్చిన రాజేశ్వరి తల్లిదండ్రులు ఆమె మెడపై ఉన్న గాయాలను గమనించి.. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేశ్వరి- ఫకీరప్పకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. పిల్లలు లేరన్న కారణంతో భర్త ఆమెను వేధించేవాడని ఆరోపించారు. ఈ విషయంపై తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండేవని చెప్పుకొచ్చారు.

Read Also: Ajith Kumar : రెండేళ్లకో సినిమాతో కనిపిస్తున్న అజిత్‌.. సినిమాలపై ఎందుకు కాన్సన్‌ట్రేషన్‌ చేయట్లేదు

అయితే, హత్య గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. ఇది సహజ మరణం కాదని, హత్య అయ్యే అవకాశం ఉందని అనుమానించి రాజేశ్వరి భర్త ఫకీరప్పను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కోపోద్రిక్తుడైన ఫకీరప్ప రాజేశ్వరిని గొంతు పిసికి హత్య చేసినట్లు అంగీకరించినట్టు పోలీసుల విచారణలో తేలింది. అనంతరం ఈ హత్యను హార్ట్ ఎటాక్‌గా చూపించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు. అయితే, రాజేశ్వరి మృతదేహాన్ని బెలగావి BIMS ఆసుపత్రికి పోస్ట్‌మార్టం కోసం తరలించారు. పోస్ట్‌మార్టం నివేదికలో ఇది హత్యేనని నిర్ధారణ అయ్యింది. దీంతో ఫకీరప్పపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచిన అనంతరం బీఎన్ఎస్ లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. పోస్ట్‌మార్టం ప్రక్రియ పూర్తయ్యాక రాజేశ్వరి మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Exit mobile version