Senior Women’s T20 Trophy 2026: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నవంబర్ 20న జరిగిన సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీ ఫైనల్లో కర్ణాటక, రైల్వేస్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో కర్ణాటక కేవలం 3 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. జట్టు కెప్టెన్, ఓపెనర్ శుభా సతీశ్ 39 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 48 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. నిక్కీ ప్రసాద్ 28 పరుగులతో రాణించింది. రైల్వేస్ బౌలర్లలో స్పిన్నర్ పూనమ్ యాదవ్ 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, స్నేహ్ రాణా 2 వికెట్లు తీసింది.
150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రైల్వేస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకే పరిమితమైంది. ఆరుషి గోయల్, మిన్ను మణి, తనూజ కన్వర్ పోరాడినప్పటికీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. కర్ణాటక బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ రైల్వేస్‌పై ఒత్తిడి పెంచారు. ముఖ్యంగా తేజస్విని 3 వికెట్లు పడగొట్టగా, శ్రేయాంక పాటిల్ 2 వికెట్లతో మరోసారి సత్తా చాటింది. దీంతో కర్ణాటక 3 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది.
భారత మహిళల క్రికెట్ జట్టులో యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ కొంతకాలంగా చోటు కోల్పోయింది. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులోనూ ఆమెకు అవకాశం దక్కలేదు. అయితే సెలెక్టర్ల నిర్ణయంతో నిరాశ చెందకుండా తన ప్రదర్శనతోనే సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్లుగానే అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీ 2026లో ఏకంగా 22 వికెట్లు పడగొట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేకాకుండా తన సొంత జట్టు కర్ణాటకకు ఛాంపియన్‌షిప్ అందించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఫైనల్ మ్యాచ్ శ్రేయాంక పాటిల్‌కు మరింత ప్రత్యేకంగా నిలిచింది. జట్టు టైటిల్ గెలవడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆమె అరుదైన ఘనత సాధించింది. రైల్వేస్ బ్యాటర్ స్నేహ్ రాణాను ఔట్ చేసి తన రెండో వికెట్ ఖాతాలో వేసుకున్న వెంటనే సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీ ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించింది. ఈ టోర్నీలో మొత్తం 22 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో నిలిచింది.
Shreyanka Patil took two wickets in the 2026–27 Senior Women’s T20 Trophy Elite final against Railways, finishing as the tournament’s leading wicket-taker with 22 wickets as Karnataka won by three runs to claim their maiden title 🏆.
• Matches: 10
• Total Wickets: 22
• Best Figures: 5/18 (vs Goa)
• Five-Wicket Hauls: 2#ShreyankaPatil #Karnataka #RCB 🏏
https://t.co/M2wJlzrwAl
— 🏏Cricket-Soccer⚽ Nostalgiation (@RiteshJ88156274) November 20, 2026

