Site icon NTV Telugu

High Court: “ఇది అమెరికా కాదు.. భారత్”.. హైకోర్టులో ఎక్స్‌(ట్వీటర్)కు భారీ ఎదురుదెబ్బ..!

X

X

Karnataka High Court Rejects X (Twitter) Petition: కర్ణాటక హైకోర్టులో ఎక్స్ (గతంలో ట్విట్టర్)కు ఎదురుదెబ్బ తగిలింది. ప్లాట్‌ఫారమ్‌లోని కొన్ని ఖాతాలు, పోస్ట్‌లను బ్లాక్ చేయాలన్న కేంద్రం ఆదేశాలను సవాలు చేస్తూ ఎక్స్(గతంలో ట్వీటర్) దాఖలు చేసిన పిటిషన్‌లను కర్ణాటక హైకోర్టు బుధవారం కొట్టివేసింది. భారతదేశంలో పనిచేయడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు దేశ చట్టాలను పాటించాలని జస్టిస్ ఎం. నాగప్రసన్న స్పష్టం చేశారు. ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియాను నియంత్రించడం అవసరమని, కంపెనీలు నియంత్రణ లేకుండా పనిచేయడానికి అనుమతించలేమని కోర్టు పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 మా దేశ పౌరులకు మాత్రమే వాక్ స్వాతంత్య్రాన్ని రక్షిస్తుందని, విదేశీ కంపెనీలు లేదా పౌరులకు ఈ ఆర్టికల్ వర్తించదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది అమెరికా కాదు.. భరత్.. యూఎస్ ఆలోచనను భారతదేశానికి వర్తించవని కోర్టు తెలిపింది.

READ MORE: Crime: తాత మరణంపై ఫేస్‌బుక్ పోస్ట్.. హత్యకు దారితీసిన ‘‘లాఫింగ్ ఎమోజీ’’..

ట్విట్టర్ కు భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ఉందని, అమెరికా చట్టాల ప్రకారం పనిచేస్తుందని, కాబట్టి భారత్ జారీ చేసిన పోస్టుల తొలగింపు ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని న్యాయవాది వాదించింది. అమెరికాలోని చట్టాలకు ఎక్స్ కట్టుబడి ఉంది. కానీ భారత్ ఆదేశాలను పాటించడానికి ఎందుకు నిరాకరిస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. భారతదేశంలో పనిచేయాలనుకునే ప్రతి ప్లాట్‌ఫామ్ ఆ మా దేశ చట్టాలతోను పాటించాల్సిందే అంటూ వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా స్వేచ్ఛను అదుపు చేయకపోవడం వల్ల అరాచకం, శాంతిభద్రతలు దెబ్బతింటాయని, అందుకే నియంత్రించాల్సిన అవసరం ఉందని కోర్టు తీర్పులో పేర్కొంది. ఇది అమెరికా కాదు.. భారత నియమాలు, నిబంధనలు భిన్నంగా ఉన్నాయని చెప్పింది. భారతదేశానికి అమెరికన్ న్యాయశాస్త్ర దరఖాస్తును సైతం కోర్టు తిరస్కరించింది.

READ MORE: Harish Rao : కాళ్లు కట్టేసి లాఠీలతో బాదడమేనా.. ప్రజాస్వామ్యమా.?

అసలు ఏంటి ఈ కేసు..?
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, అమెరికన్ పారిశ్రామికవేత్త ఎలోన్ మస్క్ సోషల్ మీడియా కంపెనీ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) భారత ప్రభుత్వంపై కోర్టును ఆశ్రయించింది. చట్టవిరుద్ధమైన కంటెంట్ నిబంధనలు, ఏకపక్ష సెన్సార్‌షిప్‌ను సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టంపై కేంద్రం వివరణ, సెక్షన్ 79(3)(బి) వినియోగంపై ఎక్స్ తన పిటిషన్‌లో ప్రశ్నించింది. ఇది సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘిస్తుందని, ఆన్‌లైన్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛను దెబ్బతీస్తుందని ఎక్స్ వాదిస్తుంది. చట్టపరమైన ప్రక్రియను దాటవేస్తూ, సమాంతర కంటెంట్ బ్లాకింగ్ యంత్రాంగాన్ని రూపొందించడానికి ప్రభుత్వం సెక్షన్ 69Aని దుర్వినియోగం చేస్తోందని పిటిషన్ పేర్కొంది. ఈ విధానం శ్రేయ సింఘాల్ కేసులో సుప్రీంకోర్టు 2015 నిర్ణయాన్ని ఉల్లంఘిస్తుందని ఎక్స్ కంపెనీ పేర్కొంది. ఆ తీర్పు ప్రకారం కంటెంట్‌ను తగిన న్యాయ ప్రక్రియ ద్వారా లేదా సెక్షన్ 69A కింద చట్టబద్ధంగా మాత్రమే బ్లాక్ చేయవచ్చని తెలిపింది.

మరోవైపు, ప్రభుత్వం సరైన విధానాన్ని అనుసరిస్తుందని, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు చట్టాన్ని పాటించాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకారం, సెక్షన్ 79(3)(b) కోర్టు ఆదేశం, ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా ఆదేశించినప్పుడు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించాలని ఆదేశించింది. ఒక ప్లాట్‌ఫామ్ 36 గంటల్లోపు నిబంధనలను పాటించకపోతే, అది సెక్షన్ 79(1) కింద సురక్షితమైన హార్బర్ రక్షణను కోల్పోయే ప్రమాదం ఉంది. చట్టాల ప్రకారం జవాబుదారీగా ఉండవచ్చు. “సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్” అనేది కొన్ని సందర్భాల్లో సంస్థలు లేదా వ్యక్తులకు చట్టపరమైన రక్షణను అందించే చట్టపరమైన నిబంధన. అయితే, X ఈ వివరణను సవాలు చేసింది. ఈ నిబంధన ప్రభుత్వానికి కంటెంట్‌ను నిరోధించే అపరిమిత హక్కును ఇవ్వదని వాదించింది. బదులుగా, ప్రభుత్వం తగిన ప్రక్రియను పాటించకుండా ఏకపక్ష సెన్సార్‌షిప్ విధించడానికి చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని ఎక్స్ కంపెనీ ఆరోపించింది.

Exit mobile version