Site icon NTV Telugu

D.K Shivakumar: తెలంగాణలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌ పర్యటన..

Dk Shivkumar

Dk Shivkumar

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌కు మద్దతుగా రెండు రోజుల పాటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ తెలంగాణలో పర్యటించారు. ఈ నేపథ్యంలో రేపు హైదరాబాద్‌ రానున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజులు పాటు తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించి బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఇందుకోస ఆయన రేపు ఉదయం బెంగుళూరు నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరు చేరుకొనున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి స్టేషన్ ఘన్‌పూర్‌ నియోజకవర్గం కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. అక్కడ నుంచి వర్ధన్న పేట నియోజకవర్గంలో.. ఆ తర్వాత వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొని రాత్రి అంబర్ పేట నియోజక వర్గం కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. ఇక శనివారం నవంబర్‌ 25న హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాలలో రోడ్ షో లు, కార్నర్ మీటింగ్‌లలో పాల్గొని ప్రచారం చేయనున్నారు.

Exit mobile version