NTV Telugu Site icon

Karnataka: సైన్‌బోర్డ్‌లపై 60 శాతం మాతృ భాష.. కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం

Karnataka

Karnataka

Bengaluru: కన్నడ మాతృ భాషా సమగ్రాభివృద్ధి (సవరణ) ఆర్డినెన్స్‌కు కర్ణాటక కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇప్పుడు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, ఆసుపత్రులు, సంస్థలకు ఏర్పాటు చేసే ‘సైన్‌బోర్డ్‌లు’ అలాగే నేమ్‌ప్లేట్లలో 60 శాతం కన్నడ భాషను ఉపయోగించాల్సి ఉంటుంది అని సిద్ధరామయ్య సర్కార్ వెల్లడించింది. అంతకుముందు డిసెంబర్ 28న బెంగళూరులో కన్నడ అనుకూల సంస్థ కర్ణాటక రక్షణ వేదిక (టీఏ నారాయణ గౌడ వర్గం) కార్యకర్తలు కన్నడ భాషలో సైన్ బోర్డులు, ప్రకటనలు, నేమ్ ప్లేట్లు లేని దుకాణాలు, వ్యాపార సంస్థలను ధ్వంసం చేశారు. సైన్ బోర్డులపై 60 శాతం కన్నడ భాషను ఉపయోగించడం తప్పనిసరి చేయాలని కర్ణాటక రక్షణ వేదిక డిమాండ్ చేసింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక పనులు చేస్తున్న వారిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా నిరసన తెలియజేయవచ్చు.. కానీ ప్రభుత్వ లేదా ప్రజా ఆస్తులకు నష్టం కలిగించవద్దని తెలిపారు.