Honey Trap: కొందరు మహిళలు ప్రముఖులనే టార్గెట్ చేస్తూ వలపు వల విసురుతారు. నగ్నంగా వీడియో కాల్ చేసి కవ్విస్తారు. వాటికి స్పందించని వారికి పోర్న్ వీడియోలు పంపి వారిని రంగంలోకి దింపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇలాంటి అనుభవమే కర్ణాటకలోని ఓ ఎమ్మెల్యేకు ఎదురైంది. ఓ మహిళ తనను హనీట్రాప్ చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపిస్తూ కర్ణాటకకు చెందిన ఓ శాసనసభ్యుడు పోలీసులను ఆశ్రయించారు. చిత్రదుర్గం ఎమ్మెల్యే జీహెచ్ తిప్పారెడ్డి తనను హనీట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. ఓ మహిళ తనకు నగ్నంగా వీడియో కాల్ చేసిందని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 31, సోమవారం కర్ణాటకలోని చిత్రదుర్గలో ఈ ఘటన జరిగింది.
Petrol and Diesel Prices: ఎన్నికల ముందు గుడ్‌న్యూస్.. మరోసారి భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!
ఎఫ్ఐఆర్ ప్రకారం ఎమ్మెల్యే తిప్పారెడ్డికి గుర్తు తెలియని నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. నగ్నంగా ఉన్న ఓ మహిళ చేసిన అసభ్యకరమైన వీడియో కాల్ చేసిందని ఎమ్మెల్యే పోలీసులకు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే వెంటనే కాల్‌ను డిస్‌కనెక్ట్ చేసినట్లు వెల్లడించారు.ఆ తర్వాత ఎమ్మెల్యే మొబైల్‌కు ఆ అసభ్యకర వీడియో వచ్చింది. హనీ ట్రాపింగ్ కేసుగా అనుమానించిన ఎమ్మెల్యే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్రదుర్గ సైబర్ క్రైమ్ పోలీసులు ఐటీ చట్టంలోని సెక్షన్ 67ఏ కింద కేసు నమోదు చేశారు. ఇది రాజకీయ ప్రత్యర్థుల పనిగా కొందరు అనుమానిస్తు్‌న్నారు. అయితే సీనియర్ నేతను హనీట్రాప్‌లోకి దించేందుకు ఓ ముఠా ప్రయత్నించిందని.. ఈ ఫిర్యాదుతో వారిపై నిఘా పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. తదుపరి విచారణలు జరుగుతున్నాయి.