Police Harassment: కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు పోలీసుల వేధింపులను తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో.. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. చొప్పదండి మండలానికి చెందిన శ్రావణ్ కుమార్ అనే యువకుడు మృతిచెందినవారిగా గుర్తించారు. ఆత్మహత్యకు ముందు శ్రావణ్ తన మొబైల్‌లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. అందులో తన మృతికి బాధ్యులుగా తన భార్య, అత్త, కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ, అలాగే మరికొందరిని స్పష్టంగా పేర్కొన్నాడు. పోలీస్ కమిషనర్ (సీపీ)కు ఉద్దేశించి మాట్లాడిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Read Also:Fire Accident: పాశమైలారంలో మరో అగ్నిప్రమాదం..!
తనపై కుటుంబ కలహాల కేసులో తప్పుడు కేసులు పెట్టారని, మహిళా స్టేషన్‌లో సీఐ తీవ్రంగా వేధించారని శ్రావణ్ ఆరోపించాడు. తన మరణానంతరం అయినా నిజాలు వెలికితీయాలని, అసలైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రావణ్ చివరి మాటలు వీడియోలో మాట్లాడాడు. పురుగుల మందు తాగిన తర్వాత శ్రావణ్‌ను కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక శ్రావణ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రావణ్ మృతికి కారణం పోలీసులు అంటూ.. బంధువులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులదే బాధ్యత అంటూ నినాదాలు చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద భారీగా పోలీసుల మోహరింపు కొనసాగుతోంది.
Read Also:Electricity Bill Shock: రిటైర్డ్ టీచర్ ఇంటికి రూ. 15,14,993 కరెంట్ బిల్లు
