Site icon NTV Telugu

Kareena Kapoor : సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ.. ఇదిగో హింట్ ఇచ్చేసిందిగా..

Kareena Kapoor

Kareena Kapoor

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగు సినిమాల్లో కనిపించక పోయిన యాడ్ లలో కనిపించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.. బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసిందో తెలిసిందే.. పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో రాణించింది.. ఇక ప్రస్తుతం ‘దిక్రూ’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. రాజేష్ కృష్ణన్ తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల 29న ఈ మూవీ విడుదల కాబోతుంది.. ఇక ఈ సినిమాలో సీనియర్ యాక్టర్స్ నటిస్తున్నారు..

ఈ ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఎయిర్ హోస్టెస్ లుగా ఈ ముగ్గురు హీరోయిన్లు ప్రయాణీకుల వస్తువులను ఎలా దొంగిలిస్తారో ఈ సినిమాలో చూపించునున్నారు.. సినిమా విడుదలకు కేవలం కొద్దిరోజులు మాత్రమే ఉండటంతో సినిమా ప్రమోషన్స్ స్పీడును పెంచారు.. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో సినిమా గురించి ఎన్నో విషయాలను ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు..

కరీనా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది.. ఈ క్రమంలో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయాన్ని చెప్పుకొచ్చింది.. నేను త్వరలోనే ఆ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నా.. ఓ స్టార్‌ హీరో నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రంలో నటించనున్నాను. సౌత్‌లో నాకిది ఫస్ట్‌ మూవీ. షూటింగ్‌లో పాల్గొనే టైమ్‌ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా అని చెప్పుకొచ్చింది.. అంతేకాదు ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ యశ్‌ హీరోగా రూపొందుతున్న కన్నడ చిత్రం ‘టాక్సిక్‌’లో కరీనా ఓ కీలక పాత్ర చేయనున్నారట.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే అధికారక వచ్చేవరకు ఆగాల్సిందే..

Exit mobile version