NTV Telugu Site icon

Mahesh Goud : పీసీసీ చీఫ్‌ మహేశ్ గౌడ్ కు కరాటే బ్లాక్ బెల్టు

Mahesh

Mahesh

Mahesh Goud : టీపీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ కరాటే బ్లాక్ బెల్టు అందుకున్నారు. ఏకంగా మూడు గంటల పాటు టెస్టుల్లో పాల్గొని ఆయన ఈ ఘనత సాధించారు. మహేశ్ కుమార్ గౌడ్ రాజకీయాల్లోనే కాకుండా కరాటేలో కూడా తన సత్తా ఏంటో ఈ సందర్భంగా చూపించేశారు. సాధారణంగా యంగ్ ఏజ్ లో ఉన్న వారికి కరాటే బెల్టు వస్తే పర్లేదు గానీ.. మహేశ్ గౌడ్ కు ఈ వయసులో కూడా రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోందని ఆయన శ్రేణులు అంటున్నారు. హైదరాబాద్‌ వెస్ట్‌ మారేడుపల్లిరోడ్డులోని వైడబ్ల్యూసీఏలో సోమవారం కరాటే పోటీలు నిర్వహించారు.

Read Also : Chandigarh: రోడ్డుపై భార్య రీల్స్.. ఉద్యోగం పోగొట్టుకున్న కానిస్టేబుల్

ఈ ప్రోగ్రామ్ కు చీఫ్‌ గెస్ట్ గా వచ్చిన మహేశ్ గౌడ్ కూడా పోటీల్లో పాల్గొన్నారు. ఏకంగా మూడు గంటల పాటు నిర్వహించిన టెస్టుల్లో ఆయన విజయం సాధించారు. దీంతో నిర్వాహకులు ఆయనకు ఒకినవా మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీ తరఫున కరాటే బ్లాక్‌బెల్ట్‌ డాన్‌ 7 ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో అందరూ కరాటే నేర్చుకోవాలన్నారు. మన ఆత్మ రక్షణలో కరాటే బాగా ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. ఈ రోజుల్లో పిల్లలు మొబలైకు అడిక్ట్ అవుతున్నారని.. ఇలాంటి వాటిల్లో పాల్గొంటే వారి హెల్త్ డెవలప్ అవుతుందన్నారు.