Site icon NTV Telugu

KantaraChapter1 : కాంతార 2 ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం పెట్టేసారు.. రెడీగా ఉండండి

Kantara

Kantara

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన ఫిల్మ్ కాంతార. జీరో ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చిన ఈ సినిమా శాండిల్ వుడ్‌ టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలిచింది. రూ. 14 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుతో కాంతారా చాప్టర్ వన్ ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను అత్యంత ప్రెస్టిజియస్ ప్రాజెక్టుగా టేకప్ చేసిన రిషబ్ శెట్టి.. ఎన్ని సమస్యలొచ్చినా అధిగమించి.. చెప్పిన టైంకి మూవీని దించేస్తున్నాడు. అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజౌతుంది కాంతార ప్రీక్వెల్.

Also Read : Senior Heroes : ఆ నలుగురు టాలీవుడ్ సీనియర్ హీరోల లైనప్ మాములుగా లేదుగా

ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది కాంతార యూనిట్. అందులో భాగంగానే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. అందుకుగాను ఈ నెల 22న అనగా సోమవారం మధ్యాహ్నం 12. 45 నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ విషయాన్నీ అఫీషియల్ గా తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు. పాన్ ఇండియా బాషలలో రిలీజ్ అవుతున్న కాంతార థియేట్రికల్ రైట్స్ కు భారీ పోటీ నెలకొంది.తెలుగులో ఈ సినిమా గీత ఆర్ట్స్ ద్వారా రిలీజ్ అవుతుండగా నైజాంలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ మైత్రీ ఫిల్మ్స్ రిలీజ్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కాంతార మొదటి రోజు భారీ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది. అందుకు తగ్గట్టే భారీ ఎత్తున రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ హైప్ తో వస్తున్న కాంతార ప్రీక్వెల్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Exit mobile version