NTV Telugu Site icon

Kannappa: బాబోయ్.. మంచు విష్ణు “కన్నప్ప” టీజర్‌ లాంచ్ ను ఇంత భారీగా ప్లాన్ చేశాడేంటి..

Kannappa

Kannappa

మే 20న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప’ పేరుతో విష్ణు మంచు ‘కన్నప్ప’ సినిమా టీజర్‌ విడుదల కానుంది. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ఇదొక చారిత్రాత్మక ఘట్టం. కన్నప్ప కేవలం సినిమా మాత్రమే కాదు., సినిమా అనుభవం., దీనివల్ల కథలు చెప్పే విధానం మారుతుంది. ఇక ఈ సినిమా చూసేందుకు అందరూ రెడ్ కార్పెట్ మీద ఎదురు చూస్తుండగా., ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. విష్ణు మంచు, అతని టీం కన్నప్పను తెలుగు చిత్రసీమలో ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా చేసింది.

Also Read: Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. ఆ నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

‘కన్నప్ప టీజర్‌ను కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని మంచు విష్ణు ట్వీట్‌ చేశారు. “ప్రపంచ ప్రేక్షకులకు మా పాపులర్ కన్నప్పను ప్రదర్శించడానికి కేన్స్ అనువైన వేదిక. మన భారతీయ కథను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం.. ప్రపంచ ప్రేక్షకులకు మన కథలు., సాంస్కృతిక వారసత్వం గురించి అవగాహన కల్పించడం మా లక్ష్యం ” అని ఆయన అన్నారు.

Also Read: PM Modi: థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ తర్వాత.. బీజేపీ 400 సీట్లు దాటుతుందనే రియాలిటీ నిజమైంది

కేన్స్‌ లో అరంగేట్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ‘వరల్డ్ ఆఫ్ కన్నప్ప’ ప్రపంచ సినిమాపై చెరగని ముద్ర వేయడానికి సిద్ధంగా ఉంది. ఆకట్టుకునే కథాంశంతో., అద్భుతమైన సినిమాటోగ్రఫీతో, భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ ఆహ్లాదకరమైన అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఉంది.

Show comments