NTV Telugu Site icon

Raveena Tandon-Kangana: కఠిన చర్యలు తీసుకోవాలి.. రవీనా టాండన్‌కు మద్దతుగా కంగనా!

Kangana Ranaut Raveena Tandon

Kangana Ranaut Raveena Tandon

Kangana Ranaut Supports Raveena Tandon: బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌, ఆమె కారు డ్రైవర్‌పై దాడి ఘటన సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. బాంద్రా కార్టర్‌ రోడ్డులో రవీనా కారు తమను ఢీట్టిందని ఓ ముస్లిం మహిళ ఆరోపించారు. రవీనా, ఆమె డ్రైవర్‌ మద్యం తాగి ఉన్నారని.. ర్యాష్‌ డ్రైవింగ్‌కు పాల్పడ్డారని ఆ మహిళ కుటుంబం ఫిర్యాదు చేసింది. దీనిపై ముంబై పోలీసులు విచారణ జరిపి క్లారిటీ ఇచ్చారు. అది తప్పుడు కేసు అని, రవీనా మద్యం తాగలేదని వెల్లడించారు.

ఈ ఘటనపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రవీనా టాండన్‌కు ఎదురైన అనుభవం చాలా తీవ్రమైనదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి కోరారు. ‘రవీనా టాండన్‌కు ఎదురైన అనుభవం చాలా తీవ్రమైనది. ఆ సమూహంలో మరో 5-6 మంది ఉంటే.. రవీనా ప్రాణాలకు ముప్పు సంభవించేది. ఇలాంటి ఘటనలను మనం తీవ్రంగా ఖండించాలి. ఇలాంటి హింసాత్మక, విషపూరిత ప్రవర్తన కలిగిన వ్యక్తులను వదిలిపెట్టొద్దు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని కంగనా సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొన్నారు.

Also Read: T20 World Cup 2024: ప్రపంచకప్‌ చూడాలని లేదు.. రియాన్‌ పరాగ్‌ సంచలన వ్యాఖ్యలు!

శనివారం రాత్రి బాంద్రా కార్టర్‌ రోడ్డులో వెళ్తున్న తన తల్లిని అదే మార్గంలో ప్రయాణిస్తున్న రవీనా టాండన్‌ కారు ఢీకొన్నట్లు ఓ వ్యక్తి సోషల్ మీడియా షేర్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు. రవీనా తనపై దాడి చేసిందని చెప్పాడు. తన తల్లి, సోదరి, మేనకోడలుతో రవీనా ఇంటి దగ్గర నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని అతను పేర్కొన్నాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. రవీనా దాడి చేయలేదని స్పష్టం చేశారు. ‘రవీనా, ఆమె డ్రైవర్‌పై ఓ వ్యక్తి తప్పుడు కేసు పెట్టాడు. మేం సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించాం. కారును పార్క్‌ చేసేందుకు డ్రైవర్‌ రివర్స్‌ చేస్తుండగా.. అదే సమయంలో ఓ కుటుంబం పక్కనుంచి నడుచుకుంటూ వెళ్తోంది. వారు కారును ఆపి డ్రైవర్‌తో గొడవకు దిగారు. రివర్స్‌ చేస్తున్నప్పుడు వెనకాల ఎవరైనా ఉన్నారా? లేదా? అని చూసుకోవా అంటూ వాగ్వాదానికి దిగారు. ఇది తీవ్రంగా మారడంతో రవీనా కారు దిగారు. డ్రైవర్‌ను రక్షించుకునేందుకు ఆమె ప్రయత్నం చేశారు. రవీనా, ఆ మహిళ కుటుంబం పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు’ అని పోలీసులు చెప్పారు.

 

 

 

Show comments