Site icon NTV Telugu

kangana ranaut : పెళ్లి చేసుకోబోతున్న కంగనా రనౌత్..?

Whatsapp Image 2023 06 14 At 3.32.17 Pm

Whatsapp Image 2023 06 14 At 3.32.17 Pm

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అయిన కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. కంగానా ఏ విషయం అయిన షూటిగా ఆ ముఖం మీదే మాట్లాడేస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే.అప్పుడప్పుడు అవసరం లేని గొడవలను కొని తెచ్చుకుంటూ ఉంటుంది. అందుకే ఆమెను అభిమానులు అందరూ ఫైర్ బ్రాండ్ అని పిలుస్తూ ఉంటారు. కంగనా నిత్యం ఏదో ఒక వివాదంతో తరచుగా సోషల్ మీడియా లో నిలుస్తూనే ఉంటారు.కొన్ని కొన్ని సార్లు అయితే తనకు అస్సలు సంబంధం లేని విషయాలలో కూడా ఆమె కలుగజేసుకుని మరి విషయాల పై స్పందించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురి అవుతూ వుంటారు.

అలాగే సమాజంలో జరిగే కొన్ని సంగతుల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సీ క్వీన్ గా కూడా పేరు సంపాదించింది కంగనా. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కంగానా ఎమర్జెన్సీ సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. కాగా తాజాగా ఆమెకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే కంగనా పెళ్ళి చేసుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. కారులో వచ్చిన కంగనాను మీడియా ప్రతినిధులంతా చుట్టుముట్టి ఆమె పెళ్లి గురించి ప్రశ్నలు కూడా వేశారు. దీంతో వెంటనే స్పందించిన కంగనా వెడ్డింగ్ కార్డు చూపిస్తూ వారికి శుభవార్త ను చెప్పింది. మీరందరూ కూడా పెళ్లికి హాజరు కావాలని వారిని అందరిని ఆహ్వానించింది. అయితే వెడ్డింగ్ కార్డులో ఆమె పేరు లేకపోవడంతో వారంతా కూడా షాక్ అయ్యారు.. దీంతో కంగనా పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు బాగా వినిపిస్తునాయి. కాగా ఇదంతా కూడా కంగనా నిర్మిస్తున్నా చిత్రం టిక్కు అండ్ షేరు సినిమా మూవీ ప్రమోషనన్స్ లో భాగంగానే చేసినట్లు సమాచారం.. దీనిని ఓటీటీ లో విడుదల చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 23నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

Exit mobile version