Pooja Hegde: కాంచన సినిమాల సిరిస్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో వర్ణించలేం. ఇప్పటి వరకు కాంచన యూనివర్స్ నుంచి మూడు సినిమాలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. తర్వలోనే కాంచన 4 సెట్స్ పైకి వెళ్లనున్నట్లు టాక్ నడుస్తుంది. ఇంతలో సినీ సర్కిల్‌లో ఒక న్యూస్ తెగ హల్‌చల్ చేస్తుంది. ఇంతకీ ఏంటా న్యూస్ అనుకుంటున్నారు.. బుట్ట బొమ్మ పూజా హెగ్డె మొదట రాఘవ లారెన్స్ సినిమాలో హీరోయిన్‌గా ఓకే అయినట్లు సమాచారం. కానీ ఏం జరిగిందో ఏమో ఇప్పుడు ఉన్నట్లుండి ఈ సినిమా నుంచి పూజా హెగ్డె బయటికి వెళ్లి పోయినట్లు టాక్ నడుస్తుంది. ఇంతకీ ఆమెను రిప్లెస్ చేసిన హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారు నేషనల్ రష్మిక మందన్న ఎంట్రీ ఇస్తున్నట్లు సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం నడుస్తుంది.
READ ALSO: Mirai : తగ్గిన మిరాయ్ టికెట్ ధరలు..!
పాపం పూజా..
‘కూలీ’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన కూడా పూజా హెగ్డెకు అదృష్టం కలిసి రాలేదని సినీ వర్గాల్లో జోరుగా టాక్ నడుస్తుంది. ఆమె లీడ్ హీరోయిన్‌గా నటించిన సినిమాలు వెండి తెరపై రాకా చాలా రోజులు అయ్యింది. ఇటు వైపు టాలీవుడ్‌లో కూడా ఆమెకు గతంలో లాగా సినిమా అవకాశాలు రావడం లేదు. ఆమెకు వచ్చిన అడపాదడపా సినీ అవకాశాలు ఇతర హీరోయిన్స్ గద్దల మాదిరిగా తన్నుకుపోతున్నారు. ఆమె అభిమానులు పూజా హెగ్డెను పాపం బుట్ట బొమ్మ అంటున్నారు. ఒకప్పుడు టాలీవుడ్‌ను సింగిల్ హ్యాండ్‌తో ఏలిన ఆమేనా ఈమే అని ఆశ్చర్యపోతున్నారు. ఇంకో వైపు.. రష్మిక మందన్న మునుపటి కన్నా జోరుగా ఉందని టాక్ నడుస్తుంది. ఆమె అడుగు పెట్టిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలవడంతో ఆమె దూకుడు గతంలో కన్నా భీభత్సంగా పెరిగిపోయింది.
READ ALSO: Pakistan: దాయాదికి అంత దమ్ము ఉందా? పాక్ బట్టలు విప్పిన జర్నలిస్ట్
