Kanaka Durga Temple: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు 9వ రోజు కనకదుర్గమ్మ మహిషాసురమర్ధిని గా దర్శనం ఇస్తున్నారు.. మహిషాసురుని సంహారం చేసిన కనకదుర్గమ్మను మహిషాసురమర్ధిని గా పిలుస్తారు.. ఇక, మహిషాసురమర్ధిని అలంకారంలో దర్శనం ఇస్తున్న కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో వేచివున్నారు భక్తులు.. తెలుగు రాష్ట్రాలతో చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భవానీలు తరలివస్తున్నారు.. ఈ రోజు రాత్రి 11 గంటల వరకూ మహిషాసురమర్ధినిగా దర్శనం ఇవ్వనున్నారు కనకదుర్గమ్మ.. మరోవైపు.. భక్తుల రద్దీ దృష్ట్యా.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలకు చేపట్టారు అధికారులు.. క్యూలైన్లలో భక్తులకు మజ్జిగ, మంచినీరు, పాలు పంపిణీ చేస్తున్నారు.. ఇక, దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి వీఐపీ భక్తుల తాకిడి కూడా పెరిగిపోయింది..
Read Also: Iron Wire in Biscuit: బిస్కెట్ లో ఇనుప తీగ.. పిల్లలు జాగ్రత్త అంటూ వీడియో షేర్ చేసిన ఓ తండ్రి..