Kanaka Durga Temple: తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఇంద్రకీలాద్రి ముందు వరుసలో ఉంటుంది. అమ్మవారిని దర్శించుకోడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తజనం తరలి వస్తుంటారు. ఈ మధ్యకాలంలో కొందరు ఆలయానికి వచ్చి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఆలయంలో ఉన్నప్పుడూ ఎలా ఉండాలి, ఎలా రావాలి అనేది పూర్తిగా మరిచి నడుచుకుంటున్నారని తోటి భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరు తెలిసి తెలియక ఆలయంలో సెల్ఫీలు దిగడం అమ్మవారి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం లాంటి పనులు చేస్తున్నారు. ఒక పక్క డ్రెస్ కోడ్ పాటించక పోవడం, మరోపక్క అమ్మవారి మూలవిరాట్ సోషల్ మీడియాలో వైరల్ చేయడం లాంటి పనులు చేస్తున్నారు. ఇక్కడ భక్తులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.. సెల్ ఫోన్స్ ఉన్న వ్యక్తులు ఆలయంలో దొంగచాటుగా అమ్మవారి స్వరూపం చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టకూడదని నిబంధన ఉంది.
READ ALSO: ప్రధాన అంశాలపై చర్చించేందుకు BRS నేతలతో కీలక సమావేశం నిర్వహించిన కేసీఆర్
ఇకపై కచ్చితంగా పాటించాల్సిందే..
పలువురు ఆలయ అధికారులు మాట్లాడుతూ.. ఆలయంలో కచ్చితంగా ఇదే డ్రెస్‌కోడ్ పాటించాలని ఏమీ లేదు. కానీ అభ్యంతరమైన దుస్తులు ధరించి రావొద్దని.. సాంప్రదాయమైన దుస్తువులు ధరించాలని రావాలి. ఇది ఆలయ ప్రతిష్టకు సంబంధించిందని, కాబట్టి వివిఐపీలు, వీఐపీలు సహా ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరికీ ఈ రూల్ వర్తిస్తుందన్నారు. ఆలయంలో పనిచేసే సిబ్బందికి సైతం అంతరాలయంలోకి ఫోన్లు తీసుకురాకూడదని స్పష్టం చేశారు. దసరా నవరాత్రి ఉత్సవాలు వస్తున్న నేపథ్యంలో కచ్చితంగా ఈ నిబంధనలు అమలు చేసేలా ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ నిబంధనలకు సంబంధించిన సైన్ బోర్డ్ సైతం ఇంద్రకీలాద్రిపై అన్ని వైపులా ఏర్పాటు చేశారు. తిరుమల తిరుపతి తరహాలో ఇంద్రకీలాద్రిలో సైతం కీలకమైన మార్పులు జరగాలని ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్నారు. ఈ నిబంధనలు పాటిస్తే ఇంద్రకీలాద్రికి మరింత ప్రాముఖ్యత పెరుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు. కాబట్టి సంప్రదాయ పరిరక్షణ, ఆలయ ప్రతిష్ట, ఆలయ భద్రత కోసం ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను పాటించాలని చెబుతున్నారు.
READ ALSO: PM Modi Funny Moment: దేనికి చప్పట్లు కొడుతున్నారంటూ.. నవ్వులు పూయించిన ప్రధాని..
