Gang Traps Men in Kamareddy: తెలంగాణలోని కామారెడ్డిలో మరో కొత్త దందా వెలుగులోకి వచ్చింది. ఓ ముఠా పురుషులతో పురుషులకే వల వేసి.. ఆపై నగ్న ఫొటోలు బయటపెడతామని బెదిరింపులకు పాల్పడి భారీగా డబ్బులు దండుకుంటోంది. పురుషులతో లైంగికంగా కలవడానికి ఆసక్తి చూపే మగ వారే ఈ ముఠా టార్గెట్. ముఠా వేధింపులు తాళలేక బాధితులు పోలీసులను ఆశ్రయించంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఐదురుగు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 40-50 మంది బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ముఠా సభ్యులు కామారెడ్డిలో ప్రత్యేకంగా ఓ డెన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ముఠా సభ్యులు సోషల్ మీడియా ద్వారా వల విసురుతారు. పురుషులతో లైంగికంగా కలవడానికి ఆసక్తి ఉన్న పురుషులను టార్గెట్ చేస్తారు. స్పందించిన వారిని కామారెడ్డిలోని డెన్‌కు రప్పిస్తారు. అంతకుముందే కొంత డబ్బు ఆన్‌లైన్ ద్వారా పే చేయించుకుంటారు. ప్రైవేటుగా కలిసే సమయంలో ఫొటోలు, వీడియోలు తీస్తారు. ఆ తర్వాత ప్రైవేట్ ఫొటోస్, వీడియోస్ ఫోన్‌కు పంపి డబ్బు కోసం వేధిస్తారు. డబ్బులు ఇవ్వకుంటే విషయం బయటపెడతామని బెదిరిస్తారు. పరువు పోతుందనే భయంతో చాలామంది భారీ మొత్తంలో డబ్బులు చెల్లించారు.
Also Read: Shreyas Iyer: వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ స్పందన ఇదే!
ముఠా సభ్యుల వేధింపులు తాళలేక బాధితులు కొందరు పోలీసులను ఆశ్రయించారు. నిందితుల ఫిర్యాదు మేరకు ఐదురుగు నిందితులను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా 40 నుంచి 50 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. రెండు నెలల వ్యవధిలో కామారెడ్డి, నిజామాబాద్‌తో పాటు పలు చోట్ల 9 కేసులు నమోదయ్యాయి. పరువు పోతుందనే భయంతో కేసులు పెట్టేందుకు బాధితులు ముందుకు రావడం లేదట. వేధింపులతో నిజామాబాద్‌కు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడట. సిరిసిల్ల, ఆదిలాబాద్, మేడ్చల్ సహా నాందేడ్‌లో కూడా బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది.
