Site icon NTV Telugu

kamal-vijay : ఆ ఒక్క విషయంలో విజయ్‌‌కి నేను సలహా ఇవ్వలేను – కమల్ హాసన్ షాకింగ్ కామెంట్

Kamal Hasson,vijay

Kamal Hasson,vijay

స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రోజు నుంచే సౌత్ పాలిటిక్స్‌లో చర్చలు ఊపందుకున్నాయి. తాజాగా ఆయన రాజకీయ ప్రయాణం, భవిష్యత్ పాత్ర గురించి మాట్లాడిన సీనియర్ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్‌కు సలహా ఇవ్వాలా అన్న ప్రశ్నకు కమల్ హాసన్ ఇచ్చిన సమాధానం రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

Also Read : Peddi: పెద్ది మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్.. !

విజయ్ ఎంట్రీ పై స్పందించిన కమల్.. “అనుభవం మనకు గురువు లాంటిది. అది నేర్పే పాఠాలు ఎవరు నేర్పించలేరు. మనుషులకు పక్షపాతం ఉండొచ్చు, కానీ అనుభవానికి ఉండదు” అంటూ పరోక్షంగా ఆయనకు రాజకీయాల్లో ఎదుర్కోవాల్సిన సవాళ్లను గుర్తుచేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా పాలిటిక్స్‌లో సిద్ధాంతాలు, ఓర్పు, ఎదురుదెబ్బలను తట్టుకునే మనస్తత్వం ఎంత అవసరమో కమల్ చెప్పకనే చెప్పారు. అలాగే తన వ్యక్తిగత సంబంధం గురించి మాట్లాడుతూ కమల్.. “విజయ్ నాకు సోదరుడు లాంటి వ్యక్తి. అతనిపై నాకు ఎంతో అనుబంధం ఉంది. కానీ ఇప్పుడు అతనికి నేను సలహా ఇవ్వలేను. ఇది కూడా సరైన సమయం కాదు’. అని ఓపికగా సమాధానమిచ్చారు.

మొత్తనికి కమల్ చేసిన వ్యాఖ్యలు, ప్రత్యక్షంగా విమర్శించకపోయినా, పరోక్షంగా విజయ్‌ను రాజకీయ వాతావరణం ఎలా ఉండబోతుందో అప్రమత్తం చేసినట్టే కనిపిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడులో దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రావిడ రాజకీయాల్లో, సినీ హీరోల ప్రవేశం కీలక మలుపులను తెచ్చిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఆ లైన్లో విజయ్ ఎంత దూరం వెళ్లగలడో, ఆయనకు కమల్ సూచించిన “అనుభవం పాఠాలు” ఎలాంటి మార్గాన్ని చూపుతాయో అన్నదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రశ్న.

Exit mobile version