Kalyan Krishna : అసిస్టెంట్ డైరెక్టర్ పడే వేదన ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ రాజ్, బిగ్ బాస్ ఫేమ్ దివి హీరో హీరోయిన్‌గా నటించిన మూవీ లంబసింగి..కాన్సెప్ట్ ఫిలిమ్స్ బ్యానర్‌పై మార్చి 15న విడుదలైన ఈ సినిమాను సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు ఫేమ్ డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ నిర్మించారు.నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు. సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్ర సక్సెస్ మీట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత కల్యాణ్ కృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముందుగా మీడియా వారికీ ధన్యవాదములు..మా సినిమాకు మీరు ఇచ్చిన రివ్యూస్ చాలా బాగున్నాయి. నేను ఒక దర్శకుడిగా ఉండి ఇంకో దర్శకుడితో సినిమా చెయ్యడానికి కారణం ఏంటంటే.. టాలెంట్ ఉండి కూడా అవకాశాలు రాకా చాలా మంది ఉంటారు. నేను కూడా అలా అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పడే వేదన ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుచేత నేను కొందరికి అవకాశం ఇద్దామని సినిమా నిర్మాణంలో అడుగు పెట్టాను” అని డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ తెలిపారు.
naviనేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు డైరెక్షన్ చెయ్యడానికి ఏడేళ్లు ఎదురుచూశాను. ప్రతిరోజు రేపే షూటింగ్ అనుకుంటూ గడిపే నాకు నాగార్జున గారూ అవకాశం ఇచ్చారు. ఆయనకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. దివి లాంటి చాలా మంది తెలుగు అమ్మాయిలు ఉన్నారు. అందరికి అవకాశాలు రావాలి. దివి ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. భారత్ రాజ్ కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు..అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది..అని దర్శకుడు కల్యాణ్ కృష్ణ అన్నారు.నవీన్ గాంధీ గారు తాను అనుకున్న కథను అద్భుతంగా తెరకెక్కించారు, ఆర్ఆర్ ధ్రువన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు. ఈ సినిమా కోసం సూపర్ మెలోడీస్ ఇచ్చారు. ఆర్ట్ ఝాన్సీ కెమెరామెన్ బుజ్జి ఇలా అందరూ కష్టపడ్డారు. వారి కష్టానికి ఫలితం ఈరోజు లభించింది. సినిమాను అందరూ చూసి ఎంకరేజ్ చెయ్యాలని కోరుకుంటున్నాను.అని దర్శకనిర్మాత కల్యాణ్ కృష్ణ పేర్కొన్నారు
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!