Site icon NTV Telugu

Kalvakuntla Himanshu: టీచర్ అవతారం ఎత్తిన కేసీఆర్ వారసుడు

Ktr Son

Ktr Son

కల్వకుంట్ల హిమాంశు… తెలంగాణ సీఎం కేసీఆర్ వారసుడు.. మంత్రి కేటీఆర్ తనయుడు. ఎప్పుడూ యాక్టివ్ గా వుంటాడు. ఇటు తండ్రితో, అటు తాతతో కలిసి తిరుగుతుంటాడు. తాజాగా హిమాంశు ఉపాధ్యాయుడి అవతారం ఎత్తి.. సంచలరం కలిగించాడు. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ఒక కార్యక్రమంలో సందడి చేశాడు. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి అంశంపై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బోధన చేశాడు. గతంలో కేసీఆర్ కూడా అధ్యాపకుడిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మనవడు కూడా అదే బాటలో కనిపించాడు. హిమాన్షు రావు విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకుంటున్నాడు. ఇటీవల హిమాన్షు ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచి తన సత్తా చాటుకున్నాడు.

Read Also:Gautham Gambhir: మరోసారి గంభీర్ వివాదస్పద వ్యాఖ్యలు.. విరాట్ కోహ్లీ కంటే అతడే గొప్ప..!!

క్రియేటివ్ యాక్షన్ సర్వీస్ (సీఏఎస్) విభాగానికి అధ్యక్షుడు కూడా అయ్యాడు. అంతేకాదు హిమాన్షు సామాజిక సేవలోనూ ముందుంటున్నాడు. బ్రిటన్ కు చెందిన తెస్సీ ఓజో సీబీఈ సంస్థ హిమాన్షుకు డయానా ఇంటర్నేషనల్ అవార్డును కూడా అందించిన సంగతి తెలిసిందే. ఖాజాగూడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సుస్థిర అభివృద్ధి, ప్రగతి లక్ష్యాలు సబ్జెక్టులో పాఠాలు చెప్పాడు హిమాంశు.

తాను టీచర్ గా మారానని, హిమాన్షు స్వయంగా ఫోటో షేర్ చేశాడు. శనివారం కూడా పనిచేయాలంటే విసుగొస్తుందని ఎవరు చెప్పారు? ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి కార్యాచరణను పిల్లలకు వివరించే అవకాశం వచ్చింది” అని తెలిపాడు. ఈ కార్యక్రమం ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగింది. తన తండ్రిలాగే ఏ కార్యక్రమంలో పాల్గొన్నా దానిని సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలియజేయడం నేర్చుకున్నాడు. తెలంగాణలో ఇప్పుడు హిమాంశు టాపిక్ హాట్ హాట్ గా మారుతోంది. తండ్రికి తగ్గ తనయుడు, తాతకు తగ్గ మనవడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి.

Read Also: ఈ అలవాట్లు ఉన్నాయా..? అయితే మీకు బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఉన్నట్లే..

Exit mobile version