Site icon NTV Telugu

Kalpana Soren: గాండే అసెంబ్లీ ఉప ఎన్నికకు కల్పనా సోరెన్ నామినేషన్

Sioe

Sioe

జార్ఖండ్‌లో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్.. గాండే అసెంబ్లీ ఉప ఎన్నికకు జేఎంఎం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఇక ఈ నామినేషన్ కార్యక్రమంలో ఆమె వెంట ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్, పలువురు పార్టీ నేతలు ఉన్నారు. ఇక్కడ మే 20న ఉప ఎన్నిక జరగనుంది. ఇక బీజేపీ నుంచి దిలీప్ వర్మను రంగంలోకి దింపింది. ఇదిలా ఉంటే నామినేషన్‌కు ముందు కల్పన.. తన అత్తామామల ఆశీర్వాదాలు తీసుకున్నారు.

మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను జైలుకు తరలించారు. అరెస్ట్‌కు ముందు ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో సతీమణి కల్పనా సోరెన్ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరిగింది. కానీ ఆమె అభ్యర్థిత్వాన్ని తోటి కోడలు సీతా సోరెన్ వ్యతిరేకించారు. దీంతో హేమంత్ వారసుడిగా చంపయ్ సోరెన్ వచ్చారు.

ఇది కూడా చదవండి: Twitter Down: నిలిచిపోయిన ట్విట్టర్.. ఐదు రోజుల్లో ఇది రెండో సారి

ఇదిలా ఉంటే ఇటీవల ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహించిన మహా ధర్నాలో కల్పనా సోరెన్ పాల్గొని కేంద్రం తీరుపై మండిపడ్డారు. అంతేకాకుండా ఢిల్లీలో సునీతా కేజ్రీవాల్‌ను కలిసి సంఘీభావం తెలియజేశారు. అనంతరం సోనియా గాంధీని కూడా కలిసి రాజకీయాలపై చర్చించారు. మొత్తానికి కల్పనా సోరెన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు.

Exit mobile version