NTV Telugu Site icon

Kalki 2898 AD : కల్కి నార్త్ అమెరికా ప్రీ సేల్స్ అదిరిపోయాయిగా..

Kalki (2)

Kalki (2)

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 AD “.మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను భారీ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.అమితాబ్ ,కమల్ వంటి దిగ్గజ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.ఇదిలా ఉంటే జూన్ 10 న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులకి సరికొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా అనిపించింది.అదిరిపోయే విజువల్స్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ మ్యాజిక్ చేసారు.హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఈసినిమాను మేకర్స్ రూపొందించారు.

Read Also:Harom Hara : గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా రానున్న ఆ స్టార్ హీరో..?

ఈ మూవీ ట్రైలర్ లో ప్రభాస్ యాక్షన్ స్టంట్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది.అలాగే అశ్వద్ధామ పాత్రలో నటిస్తున్న అమితాబ్ యాక్షన్ సీక్వెన్స్ అదరగొట్టారు.మొత్తానికి ఈ సినిమా ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.అయితే ఈ సినిమా నార్త్ అమెరికా థియేటర్ రైట్స్ ను ప్రత్యంగిరా సినిమాస్ అండ్ AAA క్రియేషన్స్ సొంతం చేసుకుంది.ఈ సినిమా ఇక్కడ ఒక రోజు ముందుగానే అంటే జూన్ 26 న రిలీజ్ కానుంది.ఇప్పటికే ఇక్కడ అడ్వాన్సు బుకింగ్ కూడా మొదలైంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నార్త్ అమెరికా ప్రీ సేల్స్ $500k మార్క్ కి చేరుకున్నట్లు సమాచారం.ఈ విషయాన్నీ తెలియజేస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసారు.ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది.

Show comments