NTV Telugu Site icon

Kalki 2898AD: మరో రికార్డు బద్దలు కొట్టిన కల్కి..

Kalki (4)

Kalki (4)

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ కల్కి కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు… ఈ సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతుంది.. ప్రమోషన్స్ లో స్పీడును పెంచింది టీమ్.. ఒక్కోరోజు ఒక్కో అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్ ను మరింత ఊరిస్తున్నారు..రీసెంట్ గా బుజ్జి అంటూ ఇటు మేకర్స్, అటు డార్లింగ్ మంచి బజ్ ను క్రియేట్ చేశారు.. ఆ బుజ్జి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

తాజాగా రిలీజ్ చేసిన సాంగ్ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది.. తాజాగా మరో రికార్డును బద్దలు కొట్టింది.. అమెరికాలో మరో రికార్డును బద్దలు కొట్టింది.. ఉత్తర అమెరికాలో $2 మిలియన్ ప్రీ సేల్స్ వసూలు చేసిన భారతీయ చిత్రంగా కల్కి నిలవడం విశేషం.. ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా రిలీజ్ కు ముందే అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది.. ఈ సినిమా ప్రీమియర్ షోలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి..

ఒక్క నార్త్ అమెరికాలోనే రెండు మిలియన్ల డాలర్లు కొల్లగొడితే.. అది కూడా విడుదలకు ఇంకా తొమ్మిది రోజులు ఉంటే.. ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో ఊహించడం కష్టమని ఫ్యాన్స్ అంటున్నారు.. మరోవైపు ఓటీటీ పార్ట్నర్ ను భారీ ధరకు ఫిక్స్ చేసుకుంది.. నెట్ ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నారు.. సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ కథతో రాబోతున్న ఈ సినిమాకు నాగ్అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.. అలాగే అమితా బచ్చన్,కమల్‌ హాసన్‌, దిశా పటానీ కీలక పాత్రలు నటిస్తున్నారు..

Show comments