NTV Telugu Site icon

Kalki 2898 AD : పాపులర్ మీమ్స్ తో కల్కి యానిమేషన్ సిరీస్ ను నింపేసారుగా..

Bujji And Bhairava

Bujji And Bhairava

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 ఏడి’.మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో అమితాబ్ ,కమల్ వంటి దిగ్గజ నటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జిని మేకర్స్ ప్రేక్షకులకు పరిచయం చేశారు.

Read Also :Kamakshi Bhaskarla : స్టోరీ డిమాండ్ చేస్తే అలాంటి పాత్రలో కూడా నటిస్తాను..

ఈ సినిమాలో బుజ్జి అంటే ఓ రోబోటిక్ కార్ ..అంతే కాదు ప్రభాస్ కి క్లోజ్ ఫ్రెండ్ కూడా…ఈ సినిమాలో బుజ్జి క్యారెక్టర్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం.అందుకే బుజ్జిని పరిచయం చేయడానికి మేకర్స్ రామోజీ ఫిలిం సిటీ లో ఓ భారీ ఈవెంట్ ఏర్పాటు చేసారు.ఇదిలా ఉంటే ఈ సినిమాతో మేకర్స్ ఒక కొత్త సినిమాటిక్ యూనివర్స్ ని కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాటిక్ యూనివర్స్ ప్రేక్షకులకి అర్థంకావడం కోసం.. మేకర్స్ ఒక యానిమేటెడ్ సిరీస్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఈ సిరీస్ కు బుజ్జి అండ్ భైరవ అనే టైటిల్ ను పెట్టారు. రెండు ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఫ్యూచర్ లో రాబోయే అడ్వాన్స్డ్ వెహికల్స్ ,వెపన్స్ వంటివి ఈ సిరీస్ లో చూపించారు.ఈ సిరీస్ లో ఎంటెర్టైనేమేంట్ కోసం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని మీమ్స్ ని నాగ్ అశ్విన్ బాగా ఉపయోగించుకున్నారు.ప్రస్తుతం ఈ మీమ్స్ తో వున్న స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Show comments