NTV Telugu Site icon

Kalki 2898AD: రికార్డుల కోసం సినిమా తీయలేదు.. కల్కి నిర్మాత స్వప్నదత్‌ ఆసక్తికర కామెంట్స్‌

New Project (3)

New Project (3)

Kalki 2898AD: పాన్ ఇండియా హీరో ప్రభాస్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా కల్కి 2898 ఏడీ. ఎట్టకేలకు జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ అందుకుంది. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్లో అశ్వినిదత్ ఆధ్వర్యంలో ఆయన ఇద్దరు కూతుళ్లు ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మించారు. సినిమా ప్రమోషన్లలో కూడా వీరిద్దరూ పాల్గొన్నారు. సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీన్లు, మహాభారతం సీన్లను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

Read Also:Team India: బార్బడోస్లో అడుగుపెట్టిన టీమిండియా ఆటగాళ్లు.. (వీడియో)

ట్రైలర్, టీజర్, పోస్టర్లు రిలీజైన దగ్గర నుంచే సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండస్ట్రీ రికార్డులను బద్ధలు కొట్టగల సినిమా అని అందరూ భావించారు. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కించారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇక మొదటి రోజు కల్కి సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను వసూలు చేసి రికార్డులను నెలకొల్పింది. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 180 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని బాక్సాఫీస్ సమాచారం. ఇప్పటికే పలు చోట్ల కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులను నమోదుచేసింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. దీంతో పలువురు నిర్మాతలను కలెక్షన్స్ గురించి అడుగుతున్నట్టు సమాచారం. దీనిపై నిర్మాత స్వప్న దత్ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

Read Also:Bhaje Vaayu Vegam OTT: ఓటిటిలోకి వచ్చేసిన “భజే వాయు వేగం”.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

స్వప్న దత్ తన పోస్ట్ లో.. ‘నాకు ఆశ్చర్యంగా ఉంది. చాలామంది నాకు కాల్ చేసి రికార్డులను క్రాస్ చేశామా అని అడుగుతున్నారు. నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే ఆ రికార్డులు సృష్టించిన వాళ్లెవరూ ఆ రికార్డుల కోసం సినిమాలు తీయరు. ప్రేక్షకుల కోసం, సినిమా మీద ప్రేమతో సినిమాలు తీస్తారు. మేము కూడా అలాగే తీసాం’ అని పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే స్వప్న దత్ చేసిన పోస్ట్ తో కల్కి కలెక్షన్స్ అధికారికంగా పోస్ట్ చేయరన్న అనుమానం కలుగుతుంది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, అన్నా బెన్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, బ్రహ్మానందం వంటి స్టార్స్ సైతం నటించారు.

Show comments