Site icon NTV Telugu

Red Fort: ఎర్రకోటలో దొంగలు పడ్డరు.. రూ. కోటి విలువైన బంగారం, వజ్రాలు పొదిగిన కలశం మాయం..

Red Fort

Red Fort

ఢిల్లీలోని ఎర్రకోటలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. గత మంగళవారం ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణం నుంచి దాదాపు కోటి రూపాయల విలువైన కలశం ఎత్తుకెళ్లారు. ఎర్రకోట ప్రాంగణంలో జరిగిన మతపరమైన వేడక సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కలశం దాదాపు 760 గ్రాముల బంగారంతో తయారు చేశారు. దానిపై దాదాపు 150 గ్రాముల వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలు పొదిగి ఉన్నాయి. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకుని పరిశీలించారు.

Also Read:US Tariffs: 2 నెలల్లో భారత్ క్షమాపణలు చెబుతుంది.. అమెరికా అధికారి ప్రేలాపనలు

కేసు నమెదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. నిందితుడిని గుర్తించామని త్వరలో అతన్ని అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ కేసులో ఇండియన్ పీనల్ కోడ్ (BNS), 2023 లోని సెక్షన్ 303(2) కింద FIR నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version