Site icon NTV Telugu

Kakani Govardhan Reddy: జగన్‌తో ముగిసిన మంత్రి కాకాణి భేటీ

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy

సీఎం జగన్‌తో మంత్రి కాకాని భేటీ ముగిసింది. బయటకొచ్చి మరోసారి క్యాంప్ కార్యాలయంలోకి వెళ్లిపోయారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అనంతరం కాకాణి గోవర్దన్ రెడ్డి మాట్లాడుతూ అనిల్ కు నాకు మధ్య ఎక్కడా విభేదాలు లేవు. మేం ఎక్కడా పోటా పోటీ సభలు ఎక్కడా నిర్వహించలేదు. పోటా పోటీ సభలనేవి మీడియా సృష్టే అని కొట్టిపారేశారు.

ప్రస్తుతం నిప్పు లేకుండానే పొగ వస్తుంది. నెల్లూరులో అంతా ఫ్రెండ్లీ వాతావరణం ఉంది. నీడనిచ్చే చెట్టు నీడను నరుక్కునే మూర్ఖులం కాదు. జగన్ తిరిగి సీఎం కావడమే లక్ష్యంగా పని చేస్తాం. నాకు అనిల్ కు మధ్య ఎలాంటి గ్యాప్ లేదు. నెల్లూరులో ఎవరి ఫ్లెక్సీలు ఎవరూ చింపలేదు. ఇరువురూ సమన్వయంతో పనిచేయాలని సీఎం మమ్మల్ని ఆదేశించారు.

పార్టీ అభివృద్ది, సంక్షేమం గురించే సీఎంతో మాట్లాడాం.. ఇతర అంశాలు చర్చకు రాలేదు. అందరం కలసి సీఎంతో కలసి మాట్లాడాం. నన్ను తన సొంత వ్యక్తిగా అనిల్ భావించి ఉండొచ్చు.. అందుకే నాకు కృతఙతలు తెలపలేదని భావిస్తున్నా అన్నారు మంత్రి కాకాణి. తనను ప్రమాణ స్వీకారానికి పిలవలేదని అనిల్ ఏ నేపథ్యంలో అన్నారో..? నాకు తెలీదు. అసలు నేను అనిల్‌ కుమార్‌ ని పిలిచానా..? లేదా..? అనే విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదని దాటవేశారు కాకాణి గోవర్థన్ రెడ్డి.

Read Also: Bjp Loss Credibility: బెంగాల్‌ ప్రజల విశ్వాసం కోల్పోతున్న బీజేపీ

Exit mobile version