NTV Telugu Site icon

Kajal Aggarwal : ఆ సమయంలో అతడు చేసిన పనికి షాక్ అయ్యాను..

Kajal

Kajal

Kajal Aggarwal : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది.ఈ భామ తన సినీ కెరీర్ ఫుల్ స్వింగ్ లో వున్న సమయంలోనే తన చిన్న నాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లి తరువాత మళ్ళీ కాజల్ హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.గత ఏడాది బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది.ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ఇదిలా ఉంటే ఈ భామ నటిస్తున్న లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ “సత్యభామ”..ఈ మూవీ జూన్ నెల 7 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.దీనితో చిత్ర యూనిట్ వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.

Read Also :Actor Naresh : చందు, పవిత్రల మరణాలపై నరేష్ సంచలన వ్యాఖ్యలు..

తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న కాజల్ అభిమాని వల్ల తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని తెలియజేసింది.కొంతకాలం క్రితం ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాను. మొదటి రోజు షూటింగ్ పూర్తయింది. నేను నా కేరవాన్‌లోకి వెళ్లిపోయాను. ఇంతలో ఆ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా పని చేస్తున్న వ్యక్తి అనుమతి లేకుండా నా కేరవాన్‌లోకి వచ్చి తన షర్ట్ విప్పేసాడు.అది చూసి నేను షాక్ అయ్యాను.అయితే షర్ట్ విప్పి తన గుండెలపై నా పేరును పచ్చబొట్టు వేయించుకున్నానని చూపించాడు.అయితే అది చూసి నేను భయపడిపోయాను.నాపై అభిమానం చూపించడం నాకు ఆనందం కలిగించింది కానీ నేను అలా ఒంటరిగా వున్నప్పుడు అలా వచ్చి ప్రవర్తించడం నాకు నచ్చలేదు.వెంటనే ఇలా ఎప్పుడు చేయొద్దని అతడిని మందలించి పంపించినట్లు కాజల్ తెలిపింది.