టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన అద్భుతమైన నటనతో టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది.కాజల్ వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.తెలుగుతో పాటు తమిళ్,హిందీ చిత్రాలలో కూడా నటించి ఎంతగానో మెప్పించింది.అయితే కెరీర్ పీక్స్ లో వున్న సమయంలోనే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతం కిచ్లును ప్రేమించి ,పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లి తరువాత కాజల్ వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది.తాజాగా కాజల్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ “సత్యభామ”.ఈ మూవీలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనుంది.ఈ సినిమా “మే 17” న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది..ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌తో కాజల్ ఎంతో బిజీగా వుంది.
తాజాగా సత్యభామ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కమెడియన్ అలీ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అలీతో సరదాగా కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ గెస్ట్‌గా వచ్చింది.తాజాగా ఆ ఎపిసోడ్ ప్రోమో రిలీజైంది.ఈ షో లో కాజల్ కొన్నిఆసక్తికర విషయాలు తెలియజేసింది.తనకు పవర్‌ఫుల్ ఫిమేల్ క్యారెక్టర్స్ చేయడం అంటే ఎంతో ఇష్టమని కాజల్ తెలిపారు .ప్రస్తుతం తాను చేసిన సత్యభామ సినిమా యాక్షన్ తరహాలో సాగే పాత్ర అని ఆమె తెలిపింది.ఎప్పటి నుంచో ఇలాంటి సినిమా చేద్దామని అనుకుంటున్నాను కానీ ఇప్పటికి కుదిరిందని కాజల్ తెలిపింది.ఇదిలా ఉంటే కాజల్ ఎన్టీఆర్ ఫై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.జనతా గ్యారేజ్‌లో ఐటెంసాంగ్ చేయడానికి కారణం ఏంటని అలీ ప్రశ్నించగా కాజల్ ఆసక్తికరంగా జవాబు ఇచ్చింది.ఆ సాంగ్ చేయడానికి కారణం కేవలం పెద్ద బ్యానర్ అలాగే పెద్ద డైరెక్టర్ మంచి రెమ్యునరేషన్ అని కాదు నేను సాంగ్ చేయడానికి అస్సలు కారణం ఎన్టీఆర్.తన కోసమే ఆ పాటలో నటించడానికి తాను ఒప్పుకున్నట్లు కాజల్ తెలిపింది.
