Site icon NTV Telugu

Kajal Agarwal: ప్రతిరోజు ఆ పని గంట చేస్తానంటేనే పెళ్లికి ఒప్పుకున్న కాజల్ భర్త.. సీక్రెట్ రివీల్

Kajal Agarwal Husband

Kajal Agarwal Husband

Kajal Agarwal: సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరో హీరోయిన్లు షరతులతో పెళ్లి చేసుకుంటారని ఇప్పటికే నెట్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే పెళ్లయిపోయినా.. చాలా మంది సెలబ్రిటీల మధ్య షరతులతో పెళ్లిళ్లు జరిగినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. వీరిలో బాలీవుడ్ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, హన్సిక కూడా పెళ్లయ్యాక ఇలాంటి కండీషన్స్ పెట్టినట్లు వినికిడి. త్వరలో పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్న తమన్నా విజయ్ వర్మ మధ్య కొన్ని కండిషన్స్ ఉన్నాయట. టాలీవుడ్ జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కూడా షరతులతో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే లావణ్య త్రిపాటికి మెగా ఫ్యామిలీ కొన్ని షరతులు విధించిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Read Also:Loan App Harassment: నిజామాబాద్ లో లోన్ యాప్ వేధింపులు

ఇదిలా ఉంటే, కాజల్ అగర్వాల్ పెళ్లి సమయంలో కూడా ఆమె భర్త గౌతమ్ కిచ్లు ఓ కండిషన్ పెట్టాడట. ఆ షరతుకు అంగీకరించిన తర్వాతే ఆమె భర్త కాజల్‌ను పెళ్లి చేసుకున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే పెళ్లయ్యాక కాజల్ ఎంత బిజీగా ఉన్నా.. రోజూ ఒక గంట కాజల్ తనతో ఉండాలని, ఒక్క గంట తన కోసం కేటాయిస్తే ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలపడుతుందని కండిషన్ పెట్టాడట. కాజల్ సినిమాల్లో బిజీగా ఉన్నందున, ఇది సాధ్యమవుతుందా అని కొన్ని రోజులు ఆలోచించి, ఆ షరతుకు అంగీకరించి గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక కొన్ని రోజులు గౌతమ్ కి ఫుల్ టైమ్ ఇచ్చింది. ఆ సమయంలో ఆమె సినిమాలకు దూరమైంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయి బాబు పుట్టిన త‌ర్వాత కూడా ప్రస్తుతం రీఎంట్రీ ఇస్తోంది.

Read Also:Surekha Vani : సురేఖ వాణి కెరీర్ పాడు చేసింది ఆ స్టార్ హీరోనా?

Exit mobile version