NTV Telugu Site icon

Kajal Agarwal : బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనున్న చందమామ..?

Whatsapp Image 2023 11 09 At 1.41.58 Pm

Whatsapp Image 2023 11 09 At 1.41.58 Pm

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్‌ కు  కాజల్ అగర్వాల్ గెస్ట్‌ గా రానున్నట్లు సమాచారం. తన లేటెస్ట్ మూవీ సత్యభామ టీజర్‌ ను బిగ్‌బాస్ హౌస్ లోనే కాజల్ అగర్వాల్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.కింగ్ నాగార్జునతో కలిసి కాజల్ సందడి చేయడమే కాకుండా హౌస్ లోని కంటెస్టెంట్స్‌తో కాజల్ కొన్ని గేమ్స్ ఆడించే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తోన్నాయి.కాజల్ ఎపిసోడ్ అభిమానులను అలరించేలా స్పెషల్‌ గా డిజైన్ బిగ్‌బాస్ యాజమాన్యం సిద్ధం చేసినట్లు సమాచారం. శుక్రవారమే టీజర్‌ను రిలీజ్ చేసినా కాజల్ ఎపిసోడ్ మాత్రం శనివారం టెలికాస్ట్ కానున్నట్లు తెలుస్తుంది .కాజల్ అగర్వాల్‌తో పాటు సినిమా ప్రజెంటర్ శశికిరణ్ తిక్కా మరియు డైరెక్టర్ సందీప్ కూడా ఈ షోకు హాజరు కానున్నట్లు సమాచారం…

తెలుగు లో కాజల్ అగర్వాల్ స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది..కాజల్ తన గత సినిమాల కు భిన్నం గా ఫస్ట్‌టైమ్ లేడీ ఓరియెంటెడ్ జోనర్‌లో సత్యభామ మూవీ చేస్తోంది. ఇటీవలే ఈ భామ భగవంత్ కేసరిలో బాలయ్య సరసన హీరోయిన్ గా నటించి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నది. ఈ సినిమాతోనే కాజల్ మొదటిసారి బాలకృష్ణతో కలిసి నటించింది… అయితే సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్ర కు అంతగా ప్రాధాన్యత లేకపోవడంతో సక్సెస్ క్రెడిట్ మాత్రం కాజల్‌ ఖాతాలో చేరలేదు..సత్యభామ సినిమాతో ఆ లోటు తీరుతుందని కాజల్ భావిస్తోంది..క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతోన్న తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్‌, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తోన్నారు. మరోవైపు కాజల్ ఈ ఏడాది తమిళంలో ఘోస్టీతో పాటు కరుంగాపీయమ్ వంటి సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.కాజల్ సత్య భామ సినిమా లో యాక్షన్ మోడ్ లో కనిపించింది. ఈ సినిమా కచ్చితంగా అద్భుత విజయం సాధిస్తుందని కాజల్ ఎంతో నమ్మకంగా వుంది..

Show comments