NTV Telugu Site icon

Kajal Agarwal : తన భర్త తో కలిసి రొమాంటిక్ పోజులిచ్చిన చందమామ..

Whatsapp Image 2023 09 20 At 11.30.38 Pm

Whatsapp Image 2023 09 20 At 11.30.38 Pm

కాజల్ అగర్వాల్… ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కృష్ణ వంశీ తెరకెక్కించిన చందమామ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తరువాత వరుస గా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.కాజల్ తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు అంతే అందం మైంటైన్ చేస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది..కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది. కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఈ జంట వెకేషన్స్ కి వెళుతూ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

గత ఏడాది కాజల్, కిచ్లు దంపతులు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. కాజల్ ప్రస్తుతం తన కొడుకు భాద్యతను దగ్గరుండి చూసుకుంటుంది.. తరచుగా భర్తతో, కొడుకుతో ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలు అందుకుంటుంది.. గత ఏడాది ప్రెగ్నన్సీ కారణంగా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన కాజల్.. ఈ ఏడాది తిరిగి వరుస సినిమాలతో తో బిజీ గా మారింది.. ప్రస్తుతం కాజల్ కమల్ హాసన్ సరసన ఇండియన్ 2లో నటిస్తోంది. అలాగే కాజల్ బాలయ్య సరసన భగవంత్ కేసరి చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.నిత్యం వర్కౌట్స్ చేస్తూ మునుపటి ఫిజిక్ పొందే ప్రయత్నం చేస్తోంది.తాజాగా కాజల్ తన భర్త కిచ్లు తో కలసి రొమాంటిక్ ఫోటో షూట్ చేసింది. గణేష్ ఉత్సవాల సందర్భంగా కాజల్ గోల్డ్ కలర్ శారీలో అదరగొట్టింది..కాజల్ తన నడుము సొగసుతో మెస్మెరైజ్ చేసింది.ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Show comments