Site icon NTV Telugu

Kaikala Satyanarayana: నవరస నటనాసార్వభౌముడికి కన్నీటి వీడ్కోలు

Kaikala Satyanarayana 2

Kaikala Satyanarayana 2

Kaikala Satyanarayana: ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు ఫిల్మ్‌ నగర్‌లోని ఆయన నివాసం నుండి కైకాల అంతిమయాత్ర ప్రారంభమైంది.పార్థివ దేహాన్ని తీసుకెళుతున్న పూలరథం వెంబడి ఆయన అభిమానులు వాహనాలతో అనుసరించారు. అప్పటికే మహాప్రస్థానంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తిచేశారు. కాగా, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న కైకాల.. శుక్రవారం మరణించారని తెలిసి సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీనియర్ నటులు చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు రాజకీయ నేతలు కైకాల పార్థివదేహానికి శుక్రవారం నివాళులు అర్పించారు. కైకాల సత్యనారాయణ పెద్ద కుమారుడు లక్ష్మీ నారాయణ తండ్రికి తలకొరివి పెట్టారు.

Exit mobile version