Site icon NTV Telugu

Kaatera : కాటేరా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ

Whatsapp Image 2024 02 02 At 9.57.43 Am

Whatsapp Image 2024 02 02 At 9.57.43 Am

ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ నటించిన కన్నడ మూవీ కాటేరా..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మూవీకి పోటీగా రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా వసూళ్లతో సంచలనం సృష్టించింది.తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫమ్ అయింది. ఫిబ్రవరి 9న దర్శన్ బర్త్‌డే నుంచే మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.కన్నడలో సలార్ మూవీకి పోటీగా డిసెంబర్ 29న కాటేరా మూవీ రిలీజైంది. సలార్ వంటి పెద్ద సినిమాతో ఎందుకు పోటీ పడుతున్నారని రిలీజ్ కు ముందు దర్శన్ ను అడిగితే.. తన కాటేరా సినిమా చూసే సలార్ భయడాలని ఆయన అన్నారు.. ఆయన చెప్పినట్లే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు సుమారు నెలన్నర రోజుల తర్వాత ఫిబ్రవరి 9న ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.

నిజానికి ఈ మూవీ ఫిబ్రవరి 16న వస్తుందని అందరూ అనుకున్నారు..కానీ వారం ముందుగానే జీ5 ఈ మూవీని స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది. అయితే ఆరోజు కేవలం కన్నడ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళం వెర్షన్లు కాస్త ఆలస్యం కానున్నాయని సమాచారం.దీనికోసం ఇప్పటికే సెన్సార్ పనులు కూడా మొదలైనట్లు గతంలో వార్తలు వచ్చాయి. అన్ని భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేస్తారని అనుకున్నా.. ఫిబ్రవరి 9న కన్నడ వెర్షన్ మాత్రమే రానుంది.కన్నడలో కాటేరా మూవీకి భారీ రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ అదరగొట్టింది. కాటేరా మూవీలో సీనియర్ హీరోయిన్ మాలాశ్రీ కూతురు ఆరాధన రామ్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతోనే ఆమె కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కాటేరా మూవీలో టాలీవుడ్ నటుడు జగపతిబాబు విలన్‌గా నటించాడు. రాక్‌లైన్ వెంకటేష్ ఈ మూవీని నిర్మించారు..

Exit mobile version