Kaala : ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కాలా వెబ్ సిరీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీసెంట్ గా ఓటీటీలో వెబ్ సిరీస్‌ల హవా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓటీటీ సంస్థలు సరికొత్త వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఇక స్టార్ హీరో హీరోయిన్ లు మరియు డైరెక్టర్లు కూడా వీటిలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఓవైపు సినిమా లు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ ఎంతగానో బిజీబిజీగా ఉంటున్నారు. అలా తాజాగా ప్రముఖ హీరోయిన్ నివేదా పేతురాజ్ కూడా డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా మరియు అలా వైకుంఠపురం, విరాటపర్వం వంటి సూపర్‌హిట్ సినిమాల్లో నటించిందీ. ఈ ఏడాది విశ్వక్ సేన్ సరసన దాస్ కా ధమ్కీ అనే సినిమాలో చివరిగా కనిపించింది.రీసెంట్ గా ఓటీటీలో రిలీజైన రకుల్ ప్రీత్ సింగ్ బూ లో కూడా ముఖ్య పాత్ర పోషించింది.
ఇప్పుడు కాలా వెబ్ సిరీస్‌తో బాలీవుడ్‌లో కి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.అవినాష్ తివారీ హీరోగా నటించిన ఈ సిరీస్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరీఓ ఆఫీసర్ సితారగా నివేద కనిపించింది రోహన్ వినోద్ మెహ్రా, నితిన్ గులాటి మరియు అనిల్ ఛటర్జీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో కాలా వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది.కాలా వెబ్ సిరీస్‌కు బిజాయ్ నంబియార్ దర్శకత్వం వహించారు. ప్రముఖ టీ- సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కిషణ్ కుమార్, బిజాయ్ నంబియార్ సంయుక్తం గా ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ను నిర్మించారు.కోల్‌కతాలోని మనీలాండరింగ్, హవాలా స్కామ్‌లతో సాగే క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. ఇందులో నివేద పలు యాక్షన్ సన్నివేశాల్లో కూడ నటించింది.ఈ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని ఆమె హర్షం వ్యక్తం చేస్తోంది
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Tags
- #kaala
- #niveda pethuraj
- OTT
- release
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!