తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. తాజా రాజకీయాల్లో వినూత్న ప్రచారంతో ప్రజలకు చేరువయ్యేలా ప్రచారం చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. మరోసారి హాట్ కామెంట్స్ చేశాడు. తెలంగాణ అభివృద్ది కొరకు పోరాడుతున్న వారందరూ తన పార్టీకి మద్దతు తెలపాలన్నారు. అందరూ రండి.. కలసి మాట్లాడుతాం.. మీరే నాయకులుగా ఉండాలని కేఏ పాల్ అన్నారు.
Also Read : David Warner: వార్నర్ సంచలన ప్రకటన.. 2024లో గుడ్‌బై
అయితే రేపు ( ఆదివారం ) ఖమ్మం జిల్లాలో ప్రజాశాంతి పార్టీ కార్యాలయం ప్రారంభించేందుకు తాను వస్తున్నట్లు ఓ వీడియోలో కేఏ పాల్ వెల్లడించారు. తాను ఖమ్మం టౌన్ లోని కేకే టవర్ లోని ఫస్ట్ ప్లోర్ లో పార్టీ ఆఫీస్ ను ఓపెనింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ప్రజాశాంతి పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కు పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులు, మీడియా మిత్రులు కూడా రావాలని కోరారు.
రేపు ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల వరకే తాను అందుబాటులో ఉంటానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నాడు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, నియోజకవర్గ ఇంచార్జ్ లుగా ఉన్నవాళ్లు తెలంగాణలో మార్పు రావాలి.. కావాలి అనుకునే వాళ్లు ప్రజాశాంతి పార్టీలో జాయిన్ కావాలని కోరారు.. దీని వల్ల తెలంగాణలో నెలకొన్న పరిస్థితులకు తాను పూర్తి సహాయం చేస్తానని కేఏ పాల్ చెప్పాడు.
Also Read : Rakul preeth singh: స్కిన్ ఫిట్ డ్రెస్సులో మొత్తం చూపిస్తూ రెచ్చగొడుతున్న రకుల్..
మనల్ని కేవలం రెండు మూడు కులాలే.. రెండు మూడు కుటుంబాలే పాలిస్తున్నాయి దానికి చరమగీతం పాడుదామంటూ కేఏ పాల్ అన్నాడు. తనతో వచ్చి పని చేయాలని అనుకునే వాళ్లు రేపు ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల వరకు పార్టీ ఆఫీస్ కు రావాలంటూ ఆయన అన్నాడు. అయితే ఇప్పటికే కేఏ పాల్ తెలంగాణలోని పలువురు రాజకీయ నాయకులను తన పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం పంపించారు. ప్రస్తుతం తెలంగాణకు 5 లక్షల కోట్లు అప్పులున్నాయన్న ఆయన తాను తప్పితే ఎవరూ ఈ అప్పులు తీర్చలేరని కేఏ పాల్ అన్నారు.