Site icon NTV Telugu

TG CS: తెలంగాణ కొత్త సీఎస్ గా కె. రామకృష్ణారావు

Tg Cs

Tg Cs

తెలంగాణ రాష్ట్ర కొత్త ఛీఫ్ సెక్రెటరీగా కె. రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతమున్న సీఎస్ శాంతి కుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. 1989 బ్యాచ్‌కు చెందిన ప్రస్తుత సీఎస్‌ శాంతికుమారి 2021 జనవరి నుంచి సీఎస్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణారావును నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1991 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2016 ఫిబ్రవరి నుంచి ఆర్థిక శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టుతో ముగియనుంది. పరిపాలనలో ప్రక్షాళన దిశగా సీఎం రేవంత్ చర్యలు చేపట్టారు. CMO లో కూడా మార్పులు చేర్పులు చేపట్టినట్లు సమాచారం.
Cs Go

Exit mobile version